Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన ‘గోల్డెన్’ స్కెచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghaziabad Jewelry Heist: ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టించిన వాళ్లను చూశాం.. కానీ పెళ్లి కోసం ఏకంగా రూ.4 కోట్ల నగల దుకాణానికే కన్నం వేసిన ‘మహానుభావుడిని’ ఎప్పుడైనా చూశారా? లగ్జరీగా పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడో ఏమో.. ప్రియురాలితో కలిసి సినిమా స్క్రీన్ ప్లేని తలపించేలా ఒక రేంజ్ స్కెచ్ వేశాడు. తోటి ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చి, క్యాషియర్‌ను మత్తులో ముంచి, కేవలం 25 నిమిషాల్లో రూ.4 కోట్ల విలువైన వజ్రాలు, బంగారాన్ని దోచేశాడు. తీరా కట్ చేస్తే.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ ‘లవ్ బర్డ్స్’.. ఇప్పుడు తండ్రితో కలిసి జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. గాజియాబాద్‌లో జరిగిన ఈ షాకింగ్ దోపిడీ వెనుక ఉన్న అసలు కథ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
తాజాగా గాజియాబాద్‌లో సంచలనం సృష్టించిన రూ. 4 కోట్ల నగల దోపిడీ కేసును ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. లగ్జరీగా పెళ్లి చేసుకోవాలనే కోరికతో, ఒక ప్రియుడు తన ప్రేయసి, తండ్రితో కలిసి వేసిన భారీ స్కెచ్ పోలీసుల విచారణలో వెలుగుచూసింది. సినిమా స్క్రీన్ ప్లేని తలపించే ఈ క్రైమ్ స్టోరీ పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నితిన్ వర్మ అనే యువకుడికి కాజల్ వర్మతో వివాహం నిశ్చయమైంది. పెళ్లి వేడుకను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి భారీగా డబ్బు అవసరమైంది. దీని కోసం గాజియాబాద్‌లోని ఒక ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌ను నితిన్ టార్గెట్ చేశాడు. ప్లాన్ ప్రకారమే నెలన్నర క్రితం ఆ నగల దుకాణంలో ఉద్యోగిగా చేరాడు. స్టోర్ లోపల భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు ఎక్కడ భద్రపరుస్తారు? అనే కీలక విషయాలపై నిఘా పెట్టాడు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
మందు పార్టీతో మైండ్ బ్లాక్..
జూన్ 12న తన పెళ్లి ఖరారైందంటూ షోరూమ్ సిబ్బంది అందరికీ నితిన్ గ్రాండ్‌గా ‘మందు పార్టీ’ ఇచ్చాడు. ఈ పార్టీకి అతని ప్రియురాలు కాజల్, నితిన్ తండ్రి కూడా హాజరయ్యారు. షోరూమ్ తాళాల బాధ్యత చూసే క్యాషియర్ గౌతమ్ రాజ్‌కు నితిన్ ప్లాన్ ప్రకారమే ఎక్కువ మద్యం తాగించాడు. పార్టీ ముగిసిన తర్వాత పూర్తిగా మత్తులో ఉన్న క్యాషియర్‌ను ఇంటి దగ్గర దింపుతానని నమ్మించి, ఎవరికీ తెలియకుండా అతని దగ్గరున్న షోరూమ్ తాళాలను కాజేశాడు. మరుసటి రోజు ఉదయం రాత్రిపూట కాపలా ఉండే సెక్యూరిటీ గార్డు డ్యూటీ ముగించుకుని ఉదయం 7 గంటలకు ఇంటికి వెళ్లిపోయాడు. ఇదే అదనుగా భావించిన నితిన్, తన స్నేహితుడితో కలిసి దొంగిలించిన తాళాలతో షోరూమ్ షట్టర్ తెరిచాడు. లోపలికి దూరిన నిందితులు కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే మొదటి అంతస్తులో ఉన్న రూ. 4 కోట్ల విలువైన వజ్రాలు, రత్నాలు, బంగారు ఆభరణాలను ఊడ్చేశారు. షోరూమ్‌లో కనీసం అలారం వ్యవస్థ కూడా లేకపోవడం నిందితులకు మరింత కలిసివచ్చింది.
కటకటాలపాలైన కుటుంబం..
బాధిత జ్యువెలర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నితిన్ వర్మను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దోపిడీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ క్రైమ్ ప్లాన్‌లో భాగస్వామ్యులైన ప్రియుడు నితిన్ వర్మతో పాటు అతని ప్రేయసి కాజల్, నిందితుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి గురైన సొత్తును రికవరీ చేసేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!