Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
- జుట్టు జిడ్డుగా మారడానికి కారణాలివే
- షాంపూ చేసినా ఎందుకు తగ్గదు?
- నిపుణులు సూచించిన సింపుల్ పరిష్కారాలు
- ఎప్పుడు డెర్మటాలజిస్ట్‌ను కలవాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hair Care Tips : ప్రతి ఒక్కరి జుట్టు తీరు భిన్నంగా ఉంటుంది. కొందరికి పొడి జుట్టు ఉంటే, మరికొందరికి విపరీతమైన జిడ్డు ఉంటుంది. జుట్టు కడిగిన కొన్ని గంటల్లోనే మళ్ళీ నూనెగా, ఒకదానికొకటి అంటుకుపోయేలా మారుతోందని జిడ్డు జుట్టు ఉన్నవారు తరచుగా బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం మన తలలోని సెబేషియస్ గ్రంధులు ‘సెబమ్’ అనే సహజ నూనెను అధికంగా ఉత్పత్తి చేయడమే. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, విరిగిపోకుండా ఉండటానికి ఈ నూనె అవసరమే అయినప్పటికీ, ఇది మితిమీరినప్పుడు జుట్టు కాంతిహీనంగా మారడమే కాకుండా చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది.
జుట్టు జిడ్డుగా మారడానికి ప్రధాన కారణాలు
మనం చేసే కొన్ని చిన్న తప్పులు , అలవాట్ల వల్ల తలలో నూనె ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా జుట్టును అతిగా దువ్వడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరిగినప్పటికీ, అది సెబేషియస్ గ్రంధులను ప్రేరేపించి మరింత సెబమ్‌ను ఉత్పత్తి చేసేలా చేస్తుంది. అలాగే మనం తీసుకునే ఆహారం కూడా దీనిపై ప్రభావం చూపిస్తుంది. ‘మెడికల్ న్యూస్ టుడే’ కథనం ప్రకారం.. సంతృప్త కొవ్వు (Saturated fat) ఎక్కువగా ఉండే పదార్థాలు, అధిక గ్లైసెమిక్ ఆహారాలు , పాల ఉత్పత్తులు సెబమ్ ఉత్పత్తిని పెంచే హార్మోన్లను ఉత్తేజపరుస్తాయి. వీటితో పాటు తేమ, వేడి ఎక్కువగా ఉండే వాతావరణం వల్ల కూడా ఈ గ్రంధులు మరింత చురుకుగా మారుతాయి.
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
షాంపూ చేసినా జిడ్డు వదలకపోవడానికి కారణం ఏంటి?
చాలా మంది షాంపూ చేసిన తర్వాత కూడా జుట్టు జిడ్డుగా ఉంటే సరిగ్గా కడుక్కోలేదని భావిస్తారు. కానీ, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ ప్రియాంక కురి తెలిపిన వివరాల ప్రకారం.. దీని వెనుక పరిశుభ్రతతో పాటు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. చిక్కటి కండిషనర్లు, సిలికాన్ ఆధారిత స్టైలింగ్ ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వల్ల జుట్టు నిర్జీవంగా, జిడ్డుగా మారుతుంది. అలాగే జుట్టును అతిగా కడగడం (ఓవర్ వాషింగ్) వల్ల తలలోని సహజ నూనెలు తొలగిపోయి, చర్మం పొడిబారకుండా రక్షించుకోవడానికి గ్రంధులు మరింత నూనెను ఉత్పత్తి చేస్తాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఒత్తిడి, జన్యుపరమైన లోపాలు, , సెబోర్హెయిక్ డెర్మటైటిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా తలలో దురద, పొరలు రాలడంతో పాటు అధిక జిడ్డు పేరుకుపోతుంది.
జిడ్డు సమస్యకు అద్భుతమైన పరిష్కారాలు
ఆహార నియమాలు: మీ రోజువారీ డైట్లో విటమిన్ బి2 , బి7 (బయోటిన్) అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
ఆపిల్ సైడర్ వెనిగర్: జుట్టును నీటితో కడిగిన తర్వాత, కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇది తల చర్మం pH స్థాయిని సమతుల్యం చేసి, సెబమ్ ఉత్పత్తిని అదుపు చేస్తుంది.
సరైన హెయిర్ ప్రొడక్ట్స్ ఎంపిక: జిడ్డు జుట్టు కోసమే ప్రత్యేకంగా తయారైన, బరువైన నూనెలు లేని షాంపూలను ఎంచుకోవాలి. ‘హెల్త్‌లైన్’ మార్గదర్శకాల ప్రకారం.. కండిషనర్ను ఎప్పుడూ తల చర్మానికి (Scalp) రాయకూడదు, దానిని కేవలం జుట్టు చివర్లకు మాత్రమే అప్లై చేయాలి.
కడిగే అలవాటు మార్చుకోండి: వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే జుట్టును కడగాలి. తరచుగా షాంపూ చేయడం అస్సలు మంచిది కాదు. బరువైన స్టైలింగ్ ప్రొడక్ట్స్ వాడకాన్ని తగ్గించి, జుట్టును పదే పదే తాకకుండా ఉండటం మంచిది.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?
ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ జుట్టులో జిడ్డు తగ్గకుండా, దాంతో పాటు విపరీతమైన ఎరుపుదనం, దురద, అధికంగా పొట్టు రాలడం లేదా జుట్టు విపరీతంగా రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా చర్మవ్యాధి నిపుణుడిని (Dermatologist) సంప్రదించడం ఉత్తమం. వైద్యుల ద్వారా సమస్యకు గల మూల కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం వల్ల తల చర్మ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మీ జుట్టు మళ్లీ ఒత్తుగా, అందంగా మారుతుంది.
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!