Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Bun Dosa: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చిరుధాన్యాలతో తయారయ్యే వంటకాలకు డిమాండ్ పెరుగుతోంది. అలాంటి వాటిలో రాగితో తయారుచేసే “రాగి బన్ దోస” కూడా ఒకటి. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మృదువుగా, స్పాంజీగా ఉండే ఈ బన్ దోస పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. మరి ఇలాంటి హెల్తి దోసలను ఎలా చేయాలో ఇక్కడ చూసేద్దాం..
కావలసిన పదార్థాలు:
* రాగి పిండి – 1 కప్పు
* బొంబాయి రవ్వ – ½ కప్పు
* పెరుగు – ½ కప్పు
* ఉల్లిపాయ ముక్కలు – 1
* పచ్చిమిర్చి ముక్కలు – 2
* అల్లం తురుము – 1 టీస్పూన్
* కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు
* జీలకర్ర – ½ టీస్పూన్
* ఉప్పు – తగినంత
* నీరు – అవసరమైనంత
* నూనె లేదా నెయ్యి – దోస కాల్చడానికి
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
తయారీ విధానం:
* ముందుగా ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత అవసరమైనంత నీరు పోసి గట్టిగా ఉండే మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాలు పక్కన ఉంచాలి.
* ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి మరోసారి బాగా కలపాలి. మిశ్రమం బన్ దోసకు సరిపడేలా కొద్దిగా గట్టిగా ఉండాలి.
* ఇప్పుడు స్టవ్‌పై దోసె పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. సిద్ధం చేసిన మిశ్రమాన్ని గరిటెతో తీసుకుని పెనం మీద చిన్న బన్ ఆకారంలో పోయాలి. మూత పెట్టి మధ్యస్థ మంటపై కొన్ని నిమిషాలు కాల్చాలి. కింద భాగం బంగారు రంగులోకి మారిన తర్వాత మరో వైపు తిప్పి కాల్చాలి. రెండు వైపులా బాగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
* వేడివేడిగా ఉన్న రాగి బన్ దోసను కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా సాంబార్‌తో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచి బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుంది. అందుకే ‘రాగి బన్ దోస’ ఆరోగ్యకరమైన టిఫన్ గా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!