ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎదురుచూస్తోన్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది హైకోర్టు.. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది.. దీంతో సినిమా విడుదలకు ఎలాంటి అడ్డుంకులు లేకుండా.. అన్నీ తొలగిపోయాయి.. కాగా, అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం చరిత్రను వక్రీకరించారంటూ అల్లూరి సౌమ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారాజు, కొమ్రంభీంలను దేశభక్తులుగానే చూపామని హైకోర్టుకు నివేదించారు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ దర్శకనిర్మాతలు.. ఇక, ఆ మూవీ కల్పిత కథనేనని కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ నిలిపేయాలన్న పిల్‌ను కొట్టివేసింది. మరోవైపు.. సినిమాతో అల్లూరి, కొమ్రంభీం పేరు, ప్రతిష్టలకు ఎలాంటి భంగం కలగదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది హైకోర్టు.
Read Also: Ukraine Russia War: ఆపరేషన్ గంగ సక్సెస్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో.. అల్లూరి సీతారామ రాజు పాత్రలో మెగాపవర్‌స్టార్ రాంచరణ్, కొమ్రం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్ సీత పాత్రలో.. అజయ్ దేవ్‌గన్, శ్రియా, సముద్రఖని తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు… డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించగా… ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది.