Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wedding Expenses: తెలుగు ఇళ్లల్లో పెళ్లి బాజాల సందడి మొదలైంది. గత నెలన్నర రోజులుగా అధిక జ్యేష్ఠ మాసాల వల్ల ఆగిపోయిన శుభకార్యాల హడావుడి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. జూన్ 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రవేశించడంతో పెళ్లిళ్ల హడావుడి షురూ అయ్యింది. అయితే, ఈ సంతోషాల వెనుక పెళ్లి పెద్దలకు ఒక పెద్ద బడ్జెట్ సవాల్ ఎదురవుతోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సమయం చాలా తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. జూన్ 18 నుంచి జులై 9 వరకు మాత్రమే పరిమితంగా శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ జులై 15 నుంచి ఆషాఢమాసం, గురుమూఢం మొదలై ఆగస్టు 15 వరకు బ్రేక్ పడనుంది. తిరిగి శ్రావణ మాసం వస్తేనే గానీ మళ్లీ శుభకార్యాలు జరగవు. ఈ కాస్త గ్యాప్‌లోనే పెళ్లిళ్లు కానిచ్చేయాలని అందరూ ఒకేసారి ప్రయత్నిస్తుండటంతో మార్కెట్లో విపరీతమైన పోటీ ఏర్పడింది. సమయం తక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని పురోహితులు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, డెకరేటర్లు అందరూ డిమాండ్‌ను బట్టి రేట్లు పెంచేస్తున్నారు.
మరోవైపు అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం తెలుగు లోగిళ్ల పెళ్లిళ్లపై గట్టిగానే పడుతోంది. యుద్ధ వాతావరణం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు, వాహనాల కిరాయిలు భారీగా పెరిగాయి. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదలను సాకుగా చూపిస్తూ క్యాటరింగ్ నిర్వాహకులు ప్లేటు ధరలను పెంచేశారు. సమాజంలో హోదా కోసం కనీసం పాతిక రకాల వంటకాలతో విందు వడ్డించడం రివాజుగా మారడంతో, ఇప్పుడు ప్లేటు ధర కనీసం రూ.500 దాటుతోంది. వీటన్నింటికీ మించి మధ్యతరగతి, పేద కుటుంబాలకు పెళ్లిలో అత్యంత కీలకమైన బంగారం కొనుగోలు భారంగా మారింది. సాంప్రదాయం ప్రకారం మంగళసూత్రాలు, గొలుసు, కమ్మలు, గాజులు వంటి కనీస అవసరాల కోసమే 5-6 తులాలు కొనాల్సి వస్తోంది. ఏడాది క్రితంతో పోలిస్తే పసిడి ధరలు విపరీతంగా పెరగడం వల్ల, కేవలం బంగారం కొనుగోలుకే ఇప్పుడు రూ.7-8 లక్షలు అవుతోంది. ఇక బంగారం ఖర్చు కాకుండా… మండపం అద్దె, డెకరేషన్, విందు భోజనాలు, ప్రయాణాలకే అదనంగా మరో రూ.5 నుంచి 10 లక్షలు ఖర్చవుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల ముందటి కాలంతో పోలిస్తే, ప్రస్తుతం ఒక్కో పెళ్లికి సగటున రూ.5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. మొత్తానికి, పెళ్లి బాజాలు మోగుతున్నా.. ఖర్చుల మోత చూసి వధూవరుల తల్లిదండ్రులు మాత్రం బడ్జెట్ ఎలా సర్దాలా అని తలలు పట్టుకుంటున్నారు.
Also Read
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!