ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సొంత జిల్లాలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు, ఎల్లుండి సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. ఇడుపులపాయలోని హెలిప్యాడ్, సీఎం బస చేసే నివాసం వద్ద పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక, రేపు రాత్రి ఇడుపులపాయలోనే బస చేస్తారు సీఎం వైఎస్ […]
హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. పవన్, రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్‌కు పవన్‌కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో బలాన్ని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపైన పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది. కానీ, పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్‌కు […]
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోట్ విడుదల చేసింది. దీనితో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 11వ తేదీ వరకు పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 30న ఎన్నిక, నవంబర్ రెండున కౌంటింగ్ ఉంటుంది. ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావటంతో ఈసీ… రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం […]
హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాలను ఆర్డీవో కార్యాలయంలో సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. చరాస్తుల విలువ 2 లక్షల 82 వేలు కాగా, స్థిరాస్తుల విలువ 20 లక్షలుగా పేర్కొన్నారు. ఆయన ఏడాది సంపాదన 4 లక్షల 98 వేలు. హుజూరాబాద్ ప్రజలు తనని ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు […]
డిజిటల్ లావాదేవీలు పెరిగిన తర్వాత బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య తగ్గుముఖం పట్టినా.. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంటారు.. కానీ, వారు అలర్ట్ కావాల్సిన సమయం ఇది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.. అంటే ఒకే నెలలో 21 రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు జరగవు అన్నమాట.. ఆ 21 రోజుల్లో 14 రోజులు ఆర్బీఐ అధికారిక సెలవులు కాగా, మరో ఏడు రోజులు […]
సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇవాళ కీలక పరిణమాలు చోటుచేసుకున్నాయి.. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. ఓ వైపు అరెస్ట్‌లు చేస్తుంటే.. మరోవైపు దిద్దిబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. తెలుగు అకాడమీ డైరెక్టర్‌పై వేటు వేసింది.. ఇప్పటి వరకు తెలుగు అకాడమీ డైరెక్టర్ (ఫుల్ అడిషనల్ ఛార్జ్ )గా ఉన్న సోమిరెడ్డిని ఆ బాధ్యతల నుండి తప్పించింది ప్రభుత్వం.. ఇక, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు తెలుగు అకాడమీ డైరెక్టర్ గా అదనపు […]
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపగా.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి… గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ సారి 60 వేల ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తూర్పు గోదావరి పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.. రేపు రాజమండ్రిలో జనసేన తలపెట్టిన బహిరంగసభకు అనుమతి లేదని అర్బన్ పోలీసులు స్పష్టం చేశారు.. సభా వేదిక మార్చుకోవాలని సూచించినట్టు అడిషనల్ ఎస్పీ తెలిపారు.. బాలాజీపేటలో సభ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. మరోవైపు అనుమతిలేని కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్‌పై కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది జనసేన.. రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమధానం కార్యక్రమం వేదిక మార్చామని.. అనుమతి […]
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రోడ్ల రాజకీయం కాకరేపుతోంది.. దెబ్బతిన్న రోడ్లపై సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ చేసిన జనసేన పార్టీ.. అన్ని ఫొటోలను సేకరించి ప్రదర్శించింది.. ఇక, దెబ్బతిన్న రోడ్లను బాగుచేసేందుకు శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకుంది.. మరోవైపు.. గతంలో కంటే.. రోడ్ల నిర్వహణ ఇప్పుడు బాగుందని కొట్టిపారేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇంకో వైపు రోడ్ల దుస్థితిపై టీడీపీ కూడా గళమెత్తింది.. రాష్ట్రంలో రోడ్ల దెబ్బకు డాక్టర్లకు ప్రాక్టీస్ పెరిగిందని ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్ […]