Pawan Kalyan: విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వం.. గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే.. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ సహా పలువురు గూగుల్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఇక, విశాఖకు గూగుల్ డేటా సెంటర్‌పై ఎక్స్ (ట్విట్టర్)లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విశాఖ.. దేశంలోని మొదటి AI సిటీగా మారబోతోంది.. గూగుల్ 15 బిలియన్ AI డేటా సెంటర్‌తో విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుందన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి వికసిత్ భారత్ దిశగా చారిత్రాత్మక అడుగు పడింది.. ఈ ప్రాజెక్ట్ అందరకీ ఉపయోగపడుతుంది. యువత, రైతులు, వైద్యులు, మత్స్యకారులు, వ్యాపారవేత్తలు, మహిళలు, విద్యార్థుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు పవన్..
Read Also: Rajasthan: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. నిప్పంటుకుని 15 మంది సజీవ దహనం..
వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం ప్రధాన ప్రేరణగా పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. విశాఖలో AI డేటా సెంటర్ సాధన సీఎం చంద్రబాబు నాలుగు దశాబ్దాల విజనరీ లీడర్‌షిప్‌కు నిదర్శనంగా అభివర్ణించిన ఆయన.. AI టెక్నాలజీతో ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్న లక్ష్యం.. ప్రభుత్వం మాత్రమే కాదు, ఈ కొత్త ప్రగతి యుగానికి అందరం అవసరం అన్నారు. యువత కొత్త ఆవిష్కరణలు చేయాలి, విద్యావేత్తలు పరిశోధనలో ముందుండాలి.. పౌరులు చురుకుగా పాలుపంచుకోవాలి, పరిశ్రమలు విస్తరణకు ముందుకు రావాలి. భవిష్యత్ భారత నిర్మాణంలో విశాఖ కీలక కేంద్రంగా అవతరించనుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ చారిత్రాత్మక భాగస్వామ్యం అవుతుంది.. 15 బిలియన్ భారీ పెట్టుబడి వస్తుందన్నారు.
ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్, దేశం డిజిటల్ రంగంలో కొత్త దిశగా అడుగుపెట్టనుంది అన్నారు పవన్ కల్యాణ్.. వేలాది ఉద్యోగావకాశాలు సృష్టించబోతున్న డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇది.. యువతకు ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్‌లో కొత్త అవకాశాలు వస్తాయి.. డిజిటల్ యుగంలో భారత స్థాయిని గ్లోబల్ లీడర్‌గా బలోపేతం చేసే ప్రాజెక్ట్ ఇది.. దీనిని సహకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రి నారా లోకేష్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
The path to ‘Viksit Bharat’ from the City of Destiny is now being paved!
Visakhapatnam securing the $15 Billion Google AI Data Centre and India's first AI City is a monumental leap. This initiative guarantees that the power of AI for All is truly democratized, impacting the… https://t.co/Lt20nNVYHw
— Pawan Kalyan (@PawanKalyan) October 14, 2025