Gudivada Amarnath: చిన్నప్పుడు చందమామ కథలు వింటే.. ఇప్పుడు చంద్రబాబు కథలు వినాల్సి వస్తుంది అంటూ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినవారిని స్వాగతిస్తాం.. కానీ, వాటి వల్ల జరిగే ప్రయోజనాల మీద చర్చ జరగాలి అన్నారు.. ఏపీ ప్రభుత్వం-గూగుల్ మధ్య ఎంవోయూపై ఆయన స్పందిస్తూ.. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడం ప్రపంచ వ్యాప్తంగా లేదన్నారు.. గూగుల్ పేరుతో తండ్రి, కొడుకు ప్రమోషన్ చేసుకుంటున్నారు అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పై సెటైర్లు వేసిన.. డేటా సెంటర్‌తో పాటు డెవలప్‌మెంట్ సెంటర్ పెట్టాలని గూగుల్ నుంచి హామీ పొందాలి అని సూచించారు.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, యువతకు లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కీలకం అన్నారు.. రైడెన్ ఇన్ఫో టెక్ వల్ల వచ్చే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 200మంది మాత్రమే..
Read Also: Supreme Court : యూఏఈలో భార్యను హత్య చేసి.. 12 ఏళ్ల తర్వాత…!
2023లో అదానీ డేటా సెంటర్ కు భూములు ఇచ్చినప్పుడు ఐటీ టవర్స్ కట్టి ఎకో సిస్టం అభివృద్ధి చేయాలని., 25వేల ఉద్యోగాలు కల్పించాలని నిబంధన పెట్టామని గుర్తుచేశారు గుడివాడ అమర్నాథ్.. విద్యుత్ టారిఫ్ మీద మినహాయింపులుగా ప్రతీ నెల వెయ్యి కోట్లు అవుతుంది.. ఉపాధి, రెవెన్యూ జనరేషన్ జరగనప్పుడు 22 వేల కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ఇవ్వడం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.. గూగుల్ డేటా సెంటర్ గంటకు పవర్ సరఫరా వల్ల గ్రిడ్ మీద పడే ఒత్తిడిని స్టడీ చేశారా…? అని ప్రశ్నించారు. కేబినెట్ మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు… GOలో రెండు వందల ఉద్యోగాలు వస్తాయని చెబుతుంటే.. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ఎలా చెల్లగలరు…? అని నిలదీశారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల పరోక్షంగా ఉపాధి కల్పన అభిస్తుందని ఎలా చెప్పగలం..? చిన్నప్పుడు చందమామ కథలు వింటే ఇప్పుడు చంద్రబాబు కథలు వినాల్సి వస్తుంది అంటూ సెటైర్లు వేశారు… ఐటీ మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఛాలెంజ్ చేస్తున్నాను.. మేం ప్రస్తావించిన ఇష్యూస్ సహేతుకం కాదని ఎవరైనా చెప్పగలరా..!? అని సవాల్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..