AP Government: కాకినాడ సెజ్‌లో భూములు కోల్పోయిన రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం.. కాకినాడ సెజ్ అవార్డు భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంది.. అంతేకాదు, రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనుంది.. దీంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీకి కార్యరూపం దాల్చినట్టు అయ్యింది.. కాకినాడ సెజ్ రైతులకు కూటమి ప్రభుత్వం ఊరట.. కాకినాడ సెజ్‌కు రైతులు ఇచ్చిన భూములు వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. రైతులు ఇచ్చిన 2,180 ఎకరాలు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు. రైతుల వద్ద రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 1,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి.. అయితే, ఎన్నికల వేళ రైతులకు పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. హామీ నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్‌కి కృతజ్ఞతలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Read Also: Meesala Pilla: ‘మీసాల పిల్ల’ అదుర్స్.. మెగా గ్రేస్!
కాకినాడ సెజ్ పేరుతో యు.కొత్తపల్లి, తొండంగి మండలాలలో 10300 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నారు.. వీటిలో 8120 ఎకరాలు రైతుల ఇష్టపూర్వకంగా సెజ్ కి రిజిస్ట్రేషన్ చేశారు.. మిగతా భూమిని బలవంతంగా సేకరించారు.. తమ భూమిని వదులుకోమని రైతులు ఎన్నో పోరాటాలు చేశారు.. కేసుల్లో ఇరుక్కుని కోర్టులకు వెళ్లారు.. జైలు కి కూడా వెళ్లారు 15 ఏళ్ల పాటు ఆందోళనలు చేసి అధికారులు చుట్టూ తిరిగారు.. గత ప్రభుత్వంలో ఆ భూములను తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దానికి అనుగుణంగా జీవో కూడా జారీ చేసింది.. రైతులకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశాలు ఇచ్చింది కానీ ఆ తర్వాత అది అమలు కాలేదు.. దాంతో వేలమంది రైతులకు నిరాశ ఎదురయింది పొలిటికల్ సపోర్ట్ ఉన్నవాళ్ళ భూములు మాత్రం రిజిస్ట్రేషన్లు అయిపోయాయి.. మిగతా రైతులు తమ భూములు స్వాధీనం చేసుకున్న వారికి ప్రభుత్వ పథకాలు మాత్రం అందడం లేదు ఆన్ లైన్ లో ఇంకా ఆ భూములు సెజ్ పేరుతో చూపిస్తుంది దాంతో రైతులు తీవ్ర గందరగోళం లో ఉన్నారు పెట్టుబడి సాయం అందడం లేదని అధికారులు చుట్టూ తిరుగుతున్నారు..