Off The Record: ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే సమస్య…. నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే….. అన్న బాలకృష్ణ డైలాగ్ ఇప్పుడు టీడీపీకే అప్లయ్ అవుతోందన్న టాక్ నడుస్తోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. బాలయ్య అసెంబ్లీలో నోరు తెరిచినా… ఆయన అభిమానులు హిందూపురంలో ప్లకార్డ్‌లు ప్రదర్శించినా… అంతిమంగా ఇరుకున పడుతోంది మాత్రం పార్టీనే ఆయన సినిమా డైలాగ్‌ను అప్లయ్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ ఊసు లేదు. ఆల్రెడీ ఉన్న సమస్యలతో సతమతం అవుతున్న తెలుగుదేశం అధిష్టానం ఇప్పటికిప్పుడు చేయాలని కూడా అనుకోవడం లేదు. కానీ… ఇప్పుడున్న గోల చాలదన్నట్టు… ఉన్నట్టుండి బాలకృష్ణకు మంత్రి పదవి డిమాండ్ తెర మీదికి వచ్చింది. దాని గురించే ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇటు సినిమాలు, అటు రాజకీయాల్ని ఫుల్ టైంగా చేస్తున్న బాలకృష్ణ ఎప్పుడూ తనకు ఫలానా పదవి కావాలని అడగలేదు. నాకు ఇవ్వలేదని అలిగిన సందర్భాలు అసలే లేవు. పైగా పార్టీకి ఎప్పుడు అవసరం వచ్చినా… అందరికంటే ముందే ఉంటారు. కానీ… ఇప్పుడు ఆ పరిస్థితులకు భిన్నంగా, హఠాత్తుగా బాలయ్యకు మంత్రిపదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది. దీంతో బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటని ఆరా తీయడం మొదలైంది.
అది అభిమానుల నుంచి వచ్చిన ఇన్‌స్టంట్ రియాక్షనా లేక ఆయన మనసులో కూడా అదే ఉండి… ఫ్యాన్స్ రూపంలో బయటికి వచ్చిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో వాతావరణం ఆయన సహజశైలికి భిన్నంగా కనిపిస్తుండటం కూడా అనుమానాలకు తావిస్తోందంటున్నారు. సాధారణంగా మైండ్‌లో ఏది అనిపిస్తే… బ్లైండ్‌గా అదే బయటికి అనేస్తుంటారాయన. ఆ మాటలు వివిదాస్పదమైనా డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటుంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఫ్యాన్స్‌తో డిమాండ్స్ పెట్టించి తనకు కావాల్సింది సాధించుకుంటారా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. అదే సమయంలో పరిస్థితుల ప్రభావం ఉందేమో… అన్నది కొన్ని వర్గాల మాట. ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీ ఉంది. దాన్ని ఎమ్మెల్సీ నాగబాబుకు ఇస్తారని ప్రచారం జరిగినా… ఇంతవరకు ఏం జరగలేదు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణకు మంత్రి పదవి కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్… జగన్ హయాంలో సినిమా పరిశ్రమను అవమానించారంటూ మాట్లాడటం, దానికి సభలోనే ఉన్న బాలకృష్ణ రియాక్షన్… అన్నీ కలిపి మేటర్ ఎట్నుంచి ఎటెటో తిరిగి.. చివరికి నా వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తీసేయమని కామినేని కోరే వరకు వెళ్లాయి. ఆ సమయంలో చిరంజీవిని అవమానించారంటూ మెగా అభిమానులు బాలయ్య మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని మీద బాలకృష్ణ ఎక్కడా స్పందించలేదుగానీ… సీఎం చంద్రబాబును కలిసేందుకు సినిమా పరిశ్రమ తరపున వెళ్ళే వాళ్ల లిస్ట్‌లో తన పేరును తొమ్మిదో నంబర్‌లో పెట్టారంటూ ఆ రోజు అసెంబ్లీలోనే బాలకృష్ణ అన్న మాటల చుట్టూ కొత్త అనుమానాలు వస్తున్నాయట.
అదే…. నేను కేబినెట్ పొజిషన్‌లో ఉంటే లిస్ట్‌లో నా పేరు అంత వెనక్కి వెళ్ళేదా? అన్న భావన కూడా ఆయనకు వచ్చి ఉంటుందేమోనన్నది కొందరి అముమానం. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే… అక్కడి అభిమానులు కొందరు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ప్లకార్డ్‌లు ప్రదర్శించారు. అక్కడక్కడా ఫ్లెక్సీలు కూడా వేశారు. హిందూపురం మండలం బసవనపల్లిలో అయితే.. ఏకంగా బాలకృష్ణ కాన్వాయ్‌ని ఆపిమరీ నినాదాలు చేశారు. ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ ఆలిండియా అధ్యక్షుడు నంబూరి సతీష్‌తో పాటు కార్యకర్తలు ఈ నినాదాలు చేశారు. దీంతో బాలకృష్ణ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన నిధులు తెస్తున్నా…. అంతా దైవేచ్ఛ అని చెప్పి వెళ్ళిపోయారట. ఆ ఇన్సిడెంట్ చుట్టూనే ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా. అభిమాన సంఘాల నుంచి ఈ ప్రతిపాదన రావడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా…. అన్న ప్రశ్నకు సమాధానం వెదికే పనిలో ఉన్నారు పొలిటికల్ పరిశీలకులు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారాయన. ఈ పరిస్థితుల్లో ఎవరెవరికో పదవులు వస్తున్నప్పుడు మా లీడర్‌కి ఏం తక్కువన్న ఆలోచన అభిమానుల నుంచి వచ్చిందా? లేక ఇంకేవైనా బలమైన కారణాలున్నాయో తెలియదుగానీ…ఈ డిమాండ్ మాత్రం టీడీపీ అధిష్టానాన్ని కాస్త ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.