ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి… బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సదరు ఎంపీపై బెదిరింపులకు దిగాడు.. దీంతో.. తుళ్లూరు పోలీసులను ఆశ్రయించిన ఎంపీ పీఏ… ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.. ఇక, రంగంలోకి దిగిన తుల్లూరు పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా కూలిలాగడంతో.. ఫోన్ చేసిన వ్యక్తి బాబూరావుగా గుర్తించారు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాబూరావును అదుపులోకి తీసుకుని […]
ఇప్పటికే అన్ని సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి.. క్రమంగా కొన్ని సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ కేంద్రం చేతులు దులుపుకుంటుందని.. లాభాలు వచ్చే అవకాశం ఉన్న సంస్థలే కాదు.. లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేట్‌పరం చేస్తుందని విమర్శలు లేకపోలేదు.. అయితే, మరో 25 ఎయిర్‌పోర్టులను కూడా ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతోంది నరేంద్ర మోడీ సర్కార్.. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.. రానున్న ఐదేళ్లలో మరో […]
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడీ… లక్ష్మీనారాయణ ఇంట్లో ఇవాళ సోదాలు నిర్వహించింది ఏపీ సీఐడీ.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఓఎస్డీగా పనిచేసిన ఆయన.. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా సేవలందించారు. యువతకు ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావడంతో.. ఇవాళ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు.. Read Also: శ్రీవారి […]
కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తిరుపతి వెళ్లామంటే.. వెంటనే లడ్డూ తెచ్చారని అడుగుతుంటారు.. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ, తెలంగాణలోని అన్ని టీటీడీ ఆలయాల్లో లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతోంది.. మరోవైపు.. శ్రీనివాసమంగాపురంలోనూ లడ్డూ విక్రయాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది టీటీడీ.. రేపటి నుంచి శ్రీనివాసమంగాపురంలో లడ్డూ విక్రయాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.. మొదటి రోజు ప్రయోగాత్మకంగా 3వేల లడ్డూలను […]
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. ఏకగ్రీవం అయిన స్థానాలు మినహా.. ఇవాళ నల్గొండ, ఖమ్మం, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది.. ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం 4 గంటలకు జరిగిన పోలింగ్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.. పలు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుండగా.. […]
సీనియర్ ఎన్టీఆరే కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు.. ఇలా అంతా ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో కలిశారు.. ఆప్యాయంగా పలకరింపులు, సరదా ముచ్చట్లు.. జోకులు, చిరుమందహాసాలు.. ఇలా అంతా ఒకే చోట సరదాగా గడిపారు.. చాలా ఏళ్ల తర్వాత అందరినీ ఒకే చోటకు చేర్చిన ఘనత మాత్రం ఎన్టీఆర్ మనవరాలికే దక్కిందని చెప్పాలి.. ఎందుకంటే.. స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి మనవరాలు (చిన్న కుమార్తె, కూతురు) వివాహ వేడుక ఘనంగా ప్రారంభమైంది.. పెళ్లి కుమార్తెను చేసిన సందర్భంగా.. నందమూరి, […]
సౌతాఫ్రికాలో వెలుగు చూసినా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచాన్నిచుట్టేసే పనిలోపడిపోయింది.. ఇప్పటికే భారత్‌లో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడగా.. తాజా, మరో రెండు కేసులు పాజిటివ్‌గా తేలాయి.. ఈ నెల 4వ తేదీన జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించారు.. ఇక, అప్రమత్తమైన అధికారులు.. అతడు కలిసినవారిని ట్రేస్ చేశారు.. వారి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా […]
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా పోలింగ్ కేంద్రంలో స్వల్వ ఉద్రిక్తత నెలకొంది… పెద్దపల్లి జిల్లా బీజేపీ ఎంపీటీసీ శ్రీనివాస్‌కి టీఆర్ఎస్ ఓటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ప్రజాప్రతినిధులు వరుసక్రమంలో ఉండగా.. ఇద సమయంలో ఓదెల మండలం కొలనూరు బీజేపీ ఎంపీటీసీ శ్రీనివాస్‌కు, టీఆర్ఎస్ ఎంపీటీసీ ఓటర్లకు మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. […]
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఎందుకంటే సౌత్ వెస్ట్రన్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు అయితే.. మరికొన్ని దారి మళ్లించారు అధికారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బెంగళూరు వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే .. యలహంక – పెనుకొండ మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా.. ఈ నెల 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ […]
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టినా.. కేరళలో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి.. ఇదే సమయంలో అక్కడ బర్డ్‌ఫ్లూ కేసులు కూడా బయటపడి ఆందోళనకు గురిచేశాయి.. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా కేసులు నమోదయ్యాయి.. అయితే, తాజాగా మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు కేరళలో వెలుగు చూశాయి. అలప్పుజా జిల్లాలో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు రాష్ట్ర పశుసంవర్ధక […]