స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగించింది… ఇవాళ ఫలితాలు వెలువడిన అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు.. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు తన ఖాతాలో వేసుకున్న గులాబీ పార్టీ.. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానంలో జరిగిన ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.. ఈ నెల 10వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా.. ఇవాళ ఉదయం 8 గంటలకు […]
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగిన ఫలితాలు వెలువడుతున్నాయి.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది.. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు.. 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని నమోదు చేశారు ఎంసీ కోటిరెడ్డి.. నల్గొండ స్థానంలో మొత్తం 1,233 ఓట్లు ఉండగా… చెల్లని ఓట్లు 50 మినహాయిస్తే.. 1,183 ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు.. అందులో గెలుపు కోటా 593 ఓట్లు అయితే.. టీఆర్ఎస్ అభ్యర్థి […]
సౌతాఫ్రికాలో వెలుగు చేసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. తాజాగా కరోనా పుట్టినిల్లు చైనాను కూడా తాకింది ఈ కొత్త వేరియంట్.. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బూస్టర్ డోస్‌పై చర్చ మొదలైంది.. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 133 కోట్ల మార్క్‌ను కూడా దాటేసింది వ్యాక్సినేషన్.. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్‌దే దీనిలో అగ్రభాగం.. మరి, ఇప్పుడు బూస్టర్ డోస్‌పై చర్చ సాగుతోన్న తరుణంలో.. కోవాగ్జిన్ బెటరా..? కోవిషీల్డ్ […]
అంతర్జాతీయ మార్కెట్‌కు తోడు స్థానిక డిమాండ్ కూడా ఎప్పటికప్పుడు పసిడి ధరలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది.. సీజన్‌ను బట్టి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉంటాయి.. మరోసారి బంగారం ధర పైకి కదిలింది.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.45,120కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,220కి ఎగిసింది.. ఇక, బంగారం ధరలోనే వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది.. కిలో వెండి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది… అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను అని పేర్కొన్నారు.. కాగా, అల్లు అర్జున్‌తో ఫొటోలు దిగే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని వదులుకోకండి అంటూ… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారిపోవడంతో.. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తరలివచ్చారు.. క్యూలైన్లో […]
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని అనే ఉత్కంఠ నెలకొంది.. తెలంగాణలో ఈ నెల 10వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు అధికారులు.. ఇప్పటికే లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించారు.. ఇక, […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగులకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. విద్యార్థినులకు సహచరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. బంధువుల రాకతో చేపట్టి పనులు వాయిదా పడతాయి. ప్రత్యర్థుల కదలికలను ఓ కంట కనిపెట్టటం మంచిది. వృషభం : ఈ రోజు ఈ రాశివారు ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పోస్టల్, […]
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఏ2గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. ఆయన పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు.. ఇవాళే విచారణ చేపట్టే అవకాశం ఉంది… కాగా.. తన నివాసంలో ఏపీ సీఐడీ సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. విచారణ సందర్భంగా ఉద్వేగానికిలోనైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం […]
ఉద్యోగులు తమ పీఎఫ్ వివరాలను ఎప్పకప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు.. ప్రభుత్వం, ఈపీఎఫ్‌వో ఏ నిర్ణయం తీసుకున్నా ఆసక్తిగా గమనిస్తుంటారు.. వచ్చే వడ్డీని కూడా లెక్కలు వేస్తుంటారు.. అయితే, ఖాతాదారులకు శుభవార్త చెప్పింది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో)… పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో చెప్పిన గుడ్‌న్యూస్ విషయానికి వస్తే.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.50 శాతం వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేసినట్టు ఈపీఎఫ్‌వో వెల్లడించింది. దీంతో.. 23.34 కోట్ల మంది ఖాతారులకు లబ్ధి చేకూరుతుందని […]
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా పీఆర్సీ వ్యవహారం హట్‌టాపిక్‌గా నడుస్తోంది… అయితే, తాజా సమాచారం ప్రకారం.. పీఆర్సీపై ప్రభుత్వ కరసరత్తు దాదాపుగా పూర్తిఅయ్యింది.. పీఆర్సీ నివేదిక, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని క్రోడీకరించి నోట్ సిద్ధం చేసింది సీఎస్ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ.. ఈ సాయంత్రం ఆ రిపోర్ట్ ను సీఎస్ సమీర్ శర్మ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక, ఉద్యోగ సంఘాలకు కూడా ఆ రిపోర్ట్ ఇవ్వనున్నారు […]