యాదాద్రిలో ఇక స్వామివారి సేవలు మరింత ప్రియం కానున్నాయి… లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచేశారు… లక్ష్మీనరసింహస్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజల టిక్కెట్ల ధరలను ఏకంగా 50 శాతానికి పైగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ అధికారులు… ఇక, తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న ధరలు ఈ నెల 10వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్నాయి.. యాదాద్రిలో భక్తులు మొక్కు, శాశ్వత కైంకర్యాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ కాగా.. పెరిగిపోతోన్న ధరలు, ఉద్యోగులు […]
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది… ఈ మేరకు తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం.. సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగింది.. కానీ, కేసీఆర్ మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. సాగుభూమి ఏడేండ్లలో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు చేర్చారని తెలిపారు.. […]
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుపై ఎప్పటికప్పుడూ కొత్త తరహా ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఈ మూడు పార్టీలు ఎప్పుడైనా ఏకం కావొచ్చు అనే అంచనాలుంటాయి.. అయితే, ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుండగా.. టీడీపీ విడిగానే రాజకీయాలు చేస్తోంది.. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల కలిసి పనిచేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.. కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల […]
ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు… ఇవాళ తన బాల్య స్నేహితురాలిని వివాహం చేసుకున్నారు తేజస్వి యాదవ్.. ఢిల్లీలో తేజస్వి యాదవ్-రాచెల్ వివాహ వేడుక ఘనంగా జరిగింది… ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక నిర్వహించారు.. కరోనా నేపథ్యంలో.. ఈ వేడకకు కుటుంబసభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు.. ఇక, ఈ వివాహ వేడుకకు యూపీ మాజీ సీఎం […]
పార్లమెంట్ శీతాకాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించారు.. ప్రధాని మోడీతో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు విజయసాయిరెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధాని […]
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందిన హెలికాప్టర్ ప్రమాద ఘటన అందరినీ కలచివేసింది.. అయితే, అమరులైనవారి పార్థీవ దేహాలను తరలించే మార్గంలో పూల వర్షం కురిపించారు ప్రజలు.. అంబులెన్స్‌లు రాగానే పూల వర్షం కురిపిస్తూ.. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.. నీల్గిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్ నుంచి వారి భౌతికకాయాలను సూలూర్ ఎయిర్‌బేస్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రజలు రోడ్లకిరువైపులా నిలబడి పూల వర్షం […]
కేంద్ర ప్రభుత్వం డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో ఏడాదికి పైగా సాగిన ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించాయి రైతు సంఘాలు.. ఈ నెల 11న సింఘూ సరిహద్దును రైతులు ఖాళీయనున్నారు.. 11వ తేదీన రైతుల విజయోత్సవాలతో ఆందోళన విరమించాలనే నిర్ణయానికి వచ్చారు.. అయితే, ఆందోళన విరమణ తాత్కాలికమే.. ఇది పూర్తి విరమణ కాదు అంటూ స్పష్టం చేశారు సంయుక్త కిసాన్ మోర్చా నేత గురునామ్ సింగ్ చౌరానీ.. అన్ని డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉండడంతో.. ఆందోళన విరమిస్తున్నామని.. జనవరి […]
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల దగ్గర సమగ్ర పరిశీలన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణ పరిస్థితులు సరిదిద్దాలన్నారు. రాష్ట్ర విభజన నుంచి వీటి గురించి పట్టించుకోలేదు.. దీని వల్ల ముప్పు పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా తగినంత మంది నిర్వహణా సిబ్బంది ఉన్నారా లేదా […]
ఢిల్లీ శివారులో సుదీర్ఘ కాలంగా సాగుతోన్న రైతు సంఘాల ఆందోళన తాత్కాలికంగా వాయిదా పడింది.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు.. రైతుల ఇతర డిమాండ్లపై కూడా సానుకూలంగా ఉండడం.. కనీస మద్దతు ధరపై పాజిటివ్‌గా ఉండడంతో.. ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి లేఖ వచ్చిందన్నారు బీకేయూ నేత రాకేష్ టికాయత్… ఇక, ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని లేఖలో ఉందని […]
తమిళనాడులోని కునూరు నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది… ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు యాన భార్య మాలిక రావత్‌తో కొందరు ఆయన కుటుంబ సభ్యులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది… అయితే, దీనిపై ఇప్పటి వరకు వెలువడిన రిపోర్టుల ప్రకారం.. 14 మంది ప్రయాణం చేస్తున్నారని.. మరో నివేదికలో 9 మంది మాత్రమే ఉన్నారనే చెబుతున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఆక, ఘటనా స్థలంలో ఆర్మీ, […]