విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ ఈ మధ్య కలకలం సృష్టిస్తోంది… విజయవాడ, అమరావతి, తాడేపల్లి ప్రాంతాల్లో పలు చోట్ల చోరీలకు పాల్పడింది చెడ్డీ గ్యాంగ్.. దీంతో రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు… ఈ కేసులో పురోగతి సాధించారు.. రెండు గ్యాంగ్‌లకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.. చెడ్డీ గ్యాంగ్ చోరీ ఘటనల సీసీటీవీ ఫుటేజీని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పంపించారు బెజవాడ పోలీసులు. తాడేపల్లి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులను గుజరాత్ పోలీసులు […]
మేషం : ఈ రోజు ఈ రాశివారు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా […]
లఖింపూర్ ఖేరి ఘటన దర్యాప్తుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది… పక్కా ప్రణాళికతో, ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగిందని, నిర్లక్ష్యం కాదని స్పష్టం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్)… ఈ నేపథ్యంలో నిందితులపై హత్యాయత్నం అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతించాలని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌ను కోరింది సిట్.. ప్రస్తుతం నిందితులపై సెక్షన్ 279, 338, 304ఏ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాలు నమోదు చేశారు పోలీసులు.. అయితే, సెక్షన్ 307(హత్యాయత్నం), సెక్షన్ 326 (ప్రమాదకరమైన ఆయుధాలతో […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సర్జరీ జరిగింది… ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, మహేష్ ఆరోగ్యంపై గత కొంతకాలంగో సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది… మోకాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్తారని ప్రచారం సాగింది.. తన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ సమయంలో.. మహేష్ మోకాలికి చిన్న గాయం అయినట్టుగా తెలుస్తోంది.. తీవ్రమైన నొప్పితో బాధపడుతోన్న మహేష్.. వైద్యులను సంప్రదించగా.. సర్జరీ అవసరమని […]
ఎన్నికల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు సర్వ సాధారణమైన విషయం.. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాలెంజ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తన పంతం నెగ్గించుకున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గతంలో సవాల్ చేసిన ఆయన.. ఈ రోజు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు రావడంతో తన పంతం నెగ్గించుకున్నారు.. జగ్గారెడ్డి […]
నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది తెలంగాణ హైకోర్టు.. 226 మంది ఉపాధ్యాయుల పిటిషన్‌పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.. రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు, గతంలోని కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలు ఉన్నాయని పిటిషనర్లు వాదించారు.. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.. ఇదే సమయంలో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు […]
తెలంగాణలో ఇవాళ వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది.. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను.. ఆరింటిని తన ఖాతాలోనే వేసుకుంది గులాబీ పార్టీ.. అయితే, కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది… ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ అయ్యాయి… ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 116 ఓట్లు […]
బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎప్పుడూ తీవ్రమైన పోటీయే ఉంటుంది.. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ) ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే.. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు… ప్రభుత్త గణాంకాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ నాటికి దేశ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు నిర్మలా సీతారామన్.. […]
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది… అసలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసులో ఏముంది? ఫిట్మెంట్ 30 శాతం మార్క్ అయినా దాటుతుందా…? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలు.. ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి.. అయితే, 11వ వేతన సంఘం ఇప్పటికే 23 శాతం సిఫార్సు చేసింది.. ఇక, కేంద్రం ఇస్తున్నట్లు 14 శాతం సిఫార్సు చేసింది సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. కానీ, కనీసం 30 శాతం ఫిట్మెంట్ అయినా వస్తుందని ఆశలు […]
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను కూడా టెన్షన్ పెడుతోంది ఒమిక్రాన్.. యూఎస్‌లో శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దాదాపు 30 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరోవైపు.. కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లు దాటింది… ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ […]