మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి చర్చగా మారింది.. ఈ కేసులో సీబీఐకి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది.. ఇక, ఆమె అవినాష్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో.. వాంగ్మాలంలో సీఎం వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడం పెద్ద చర్చకు దారి తీసింది.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ వివేకా హత్య కేసులో.. గొడ్డలి పోటు నుండి గుండెపోటు డ్రామా వరకూ ఉన్న మిస్టరీ వీడిపోయిందన్న లోకేష్… బాబాయ్ వివేకాని అత్యంత కిరాతకంగా చంపేసిన అవినాష్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి.. తనకు రెండు కళ్లని చెప్పడం, సీబీఐకి అప్పగిస్తే ఇది 12వ కేసు అవుతుందని అనడం చూస్తుంటే… వివేకా హత్యకు స్కెచ్ వేసింది జగనేనని స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు.. ఇక, వైఎస్ వివేకా హత్యలో జగన్ పాత్ర పై సీబీఐ విచారణ చేపట్టానలి డిమాండ్ చేశారు నారా లోకేష్.
Read Also: Operation Ganga: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు.. రంగంలోకి వైమానిక దళం..!