Ibrahimpatnam Firing Case: కాల్పుల కేసులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పుల వ్యవహారం సంచలనగా మారింది.. ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.. అయితే, ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన భూ సెటిల్‌మెంట్లే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు.. సెటిల్‌మెంట్లతో పాటు శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కూడా దృష్టి సారించారు పోలీసులు.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి… ఆస్తులన్నింటినీ కూడా హఫీజ్, నవీన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. దీంతో.. హఫీజ్, నవీన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్‌లోని అతిపెద్ద సిటీ రష్యా స్వాధీనం
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
పదుల సంఖ్యలో ఆస్తులను నవీన్, హఫీజ్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు శ్రీనివాస్ రెడ్డి.. ఇక, తుర్కయంజాల్ సమీపంలో ఇటీవల కాలంలో శ్రీనివాస్‌రెడ్డి పెద్ద సెటిల్‌మెంట్ చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ వ్యవహారంలో కూడా పెద్ద మొత్తంలో శ్రీనివాస్ రెడ్డికి డబ్బులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.. మరోవైపు, డబుల్ రిజిస్ట్రేషన్ అయిన భూములను శ్రీనివాసరెడ్డి స్వాధీనం చేసుకుని సెటిల్‌మెంట్లు చేస్తారని చెబుతున్నారు.. ఇతర ప్రాంతంలో జరిగిన సెటిల్‌మెంట్ వ్యవహారంలోనే శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇద్దరు ప్రాణాలను బలిగొన్న ఇబ్రహీంపట్నం కాల్పుల కేసుకు సంబంధించి మీడియా సంయమనం పాటించాలని కోరారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.. కాల్పుల ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.. కేసు విచారణలో ఉంది.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా పురోగతి ఉంటే మీడియాకు చెబుతాం అన్నారు.. కాగా, మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు మట్టారెడ్డి, హఫీజ్, కృష్ణ సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!