ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఏడో రోజుకు చేరుకుంది, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశంలోని ఇతర పెద్ద నగరాలపై దాడులను తీవ్రతరం చేశాయి రష్యా బలగాలు.. రాజధాని కీవ్ సిటీపై పట్టు సాధించేందుకు రష్యా ప్రయత్నం చేస్తోంది.. ఇతర నగరాలను హస్తగతం చేసుకుంటోంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని అతిపెద్ద సిటీ అయిన ఖేర్సన్ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా పాలమిలటరీ బలగాలు ఖేర్సన్లో బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఉక్రెయిన్ సైనికులతో పాటు, పౌరులు కూడా పెద్ద సంఖ్యలో మృతిచెందినట్టుగా తెలుస్తోంది..
Read Also: AP CMO: అధికారులకు శాఖల కేటాయింపు
ఇక, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీని స్వాధీనం చేసుకునే దిశగా ముందకు కదులుతున్నాయి రష్యా బలగాలు.. మరోవైపు ఖార్కివ్ నగరంపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖార్కివ్ లోని పోలీస్ బిల్డింగ్ ను పేల్చివేసినట్లుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో పోలిస్ భవనం పూర్తిగా ధ్వసమైంది.. రష్యా దాడుల్లో కరాజిన్ నేషనల్ యూనివర్సిటీలోని ఓ భవనం కూడా ధ్వంసమైనట్లు ఆ దేశ హోం శాఖ వెల్లడించింది. కాగా, రష్యా బలగాలను తాము తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నామని.. ఇప్పటికే రష్యాకు చెందిన సైనికులు 6 వేల మంది మృతిచెందారని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే.