ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది… తమిళనాడులోని కూనురు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకోగా… ప్రమాద సమయంలో హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు కొందరు సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది… హెలికాప్టర్ ప్రమాదం తర్వాత రావత్ పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉండగా.. కోయంబత్తూర్ సూలూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్ ఆర్మీ బేస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో బిపిన్ రావత్ […]
హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. నగర శివారులో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. కాచిగూడ ప్రాంతానికి చెందిన ఓ బాలిక కోఠిలోని ఓ కాలేజీలో చదువుకుంటుంది.. నాలుగు రోజుల క్రితం బాలిక తనకు తెలిసిన ఆటోలో కాలేజీకి బయల్దేరింది.. అయితే, కళాశాలకు వెళ్తున్న బాలికకు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్.. శివారులోని మేడిపల్లికి తీసుకొని వెళ్లాడు.. మేడిపల్లిలో 4 రోజుల పాటు రోజు ఒకో […]
ఓటీఎస్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో వైసీపీ సర్కార్‌ను నిలదీస్తోంది… అయితే, విపక్షాలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం వైఎస్ జగన్.. ఓటీఎస్ పథకం, గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా.. ఓటీఎస్ పథకం పై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.. ఓటీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి.. ఓటీఎస్ అన్నది పూర్తి స్వచ్ఛందం.. క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది.. రూ.10వేల కోట్ల రూపాయల […]
ప్రపంచదేశాలను ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి వణికిస్తోంది.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఇదే సమయంలో.. ఒమిక్రాన్ అంత సీరియస్ కాదనే వాదనలు కూడా ఉన్నాయి.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే జెట్ స్పీడ్‌తో విస్తరిస్తున్నా.. ప్రాణాలకు ముప్పులేదని.. డెత్ రేట్ తక్కువని చెబుతున్నారు.. కానీ, ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. ఇప్పటికే ఫస్ట్ వేవ్ చూశాం.. కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టించిన విలయాన్ని ఇంకా మర్చిపోలేదు.. ఇప్పుడు […]
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జట్ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసేపనిలో పడిపోయింది.. ఇప్పటికే 57 దేశాలకు పాకేసిన ఒమిక్రాన్ కేసులు కొన్ని దేశాల్లో పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి.. బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ విలయమే సృష్టిస్తోంది.. ఒకే రోజు 101 కొత్త కేసులు నమోదయ్యాయి.. దీంతో.. అక్కడి ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్ ఆరోగ్య అధికారులు వెల్లడించారు.. డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్ […]
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఎన్నో భయాలు.. వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో అయిపోతుందనే అనుమానాలు.. ఇక, ఆ తర్వాత క్రమంగా వ్యాక్సిన్‌వైపు పరుగులు పెట్టారు జనం.. కానీ, అప్పుడు వ్యాక్సిన్లు దొరకని పరిస్థితి.. గంటల తరబడి లైన్లలో వేచిచూడాల్సిన దుస్థితి.. ఆ తర్వాత నో స్టాక్ బోర్డులు పెట్టి.. వ్యాక్సిన్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఎన్నో.. క్రమంగా ఆ పరిస్థితి పోయింది.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.. వ్యాక్సిన్ సెంటర్లలోనే […]
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది… ఇప్పటికే భారత్‌లో ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోవడమే కాదు.. ఆర్థికంగా కూడా అన్ని రంగాలను దెబ్బ కొట్టింది ఈ మహమ్మారి.. మరోవైపు… సౌతాఫ్రికాలో తాజాగా వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్ పెడుతోంది.. డెల్టా వేరియెంట్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే.. ఒమిక్రాన్ రూపంలో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది.. […]
కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అందరూ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు.. ఒక్కప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీదే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేది.. అయితే, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడిపోయింది.. ఏకంగా చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా.. అధికార వైసీపీ ఎత్తుల ముందు చిత్తైపోయారు.. […]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ఆందోళనకు ఏడాది దాటింది.. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిగివచ్చారు.. రైతులకు క్షమాపణలు చెప్పి.. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. అయితే, మరికొన్ని డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. కానీ, తాజా పరిస్థితి చూస్తుంటే ఆందోళన విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. తమ భవిష్యత్తు కార్యాచరణపై […]