రాష్ట్ర డీజీపీకి ఇప్పటికే పలు సందర్భాల్లో లేఖలు రాస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ మరోసారి డీజీపీకి లేఖ రాసిన ఆయన.. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ కార్యకర్త మురళీని వైసీపీ గూండాలు అక్రమంగా నిర్బంధించారు.. హత్యాయత్నానికి పాల్పడ్డారని.. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని.. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందని పేర్కొన్నారు.. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ […]
ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు టెన్షన్ పెడుతున్న వేళ.. వచ్చే ఏడాది యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి… ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన అలహాబాద్ హైకోర్టు… ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సభలపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సూచలను చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు వాస్తవాలకు దగ్గర మాట్లాడుతూ.. కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ రాస్యభసభ సభ్యులు […]
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై తాజాగా టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.. వరుసగా నానిపై ఎదురు దాడికి దిగుతున్నారు ఏపీ మంత్రులు… ఇక, నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. సినీ హీరోలు పారితోషకం తగ్గించుకుంటే.. టికెట్ల ధరలు మరింత తగ్గుతాయని తెలిపారు. మరోవైపు.. హీరో నాని ఎవరో నాకు తెలియదంటూ ఎద్దేవా చేసిన మంత్రి అనిల్.. నాకు తెలిసింది కొడాలి నాని మాత్రమే నంటూ చమత్కరించారు.. ఇక, […]
భారత్‌ను ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ పెడుతోంది.. పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తారాఖండ్, గోవా, మణిపూర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలు మొదలయ్యాయి.. ఒమిక్రాన్ విజృంభిస్తోన్న సమయంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా? లేక వాయిదా వేస్తారా? అనే చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారం, సభలు అంటే వేలాదిగా మంది గుమిగూడే పరిస్థితి ఉంటుంది.. వేగంగా వైరస్ […]
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్‌లో అడుగుపెట్టింది.. క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూనే ఉంది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే కాగా… తాజాగా, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఒమిక్రాన్ వెలుగు చూసింది… తూర్పు గోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.. దీంతో.. కోనసీమలో కలకలం మొదలైంది. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. బాధితురాలు ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చినట్టుగా […]
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయాలు వసూలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత రాజేంద్ర బాలాజీ కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి కోసం ఇప్పటికే రంగంలోకి దిగాయి పోలీసు ప్రత్యేక బృందాలు.. దాదాపు వారం రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినా మంత్రి జాడ దొరకడం లేదు.. దీంతో.. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేకుండా చర్యలు చేపట్టారు.. అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు […]
జనవరి 1వ తేదీ నుంచి ఆన్లైన్ కార్డు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతంలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు తీసుకొచ్చింది.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కార్డు టోకనైజేషన్ సర్వీసులపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది ఆర్బీఐ.. వినియోగదారుల సమ్మతితోనే కార్డు డాటా టోకనైజేషన్ ముందుకు సాగాలని అందులో పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు… ఇవాళ రెండో రోజు కడప జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించనున్న సీఎం.. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు.. ఇక, పులివెందులలో జరగనున్న బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన వివరాలను పరిశీలిస్తే.. ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం […]
పండుగల సీజన్ వచ్చేస్తోంది.. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది.. పనిలో పనిగా అందినంత దండుకునే పనిలో పడిపోయాయి రవాణా సంస్థలు.. రద్దీ పెరిగిందంటే చాలు.. అదనపు వడ్డింపులు తప్పవనే తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ రద్దీతో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. తమిళనాడులోని చెన్నై నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా వెళ్లే విమాన సర్వీసులపై ఆయా విమాన సంస్థలు […]
కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మొదటల్లో వ్యాక్సిన్లకు ధరలు నిర్ణయించి విమర్శలపాలైన కేంద్ర సర్కార్.. ఆ తర్వాత పూర్తిగా ఉచితమని ప్రకటించింది.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ చేయించుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది నరేంద్ర మోడీ సర్కార్.. ఇప్పటి వరకు వ్యాక్సిన్లపై ఎంత ఖర్చు చేశారంటూ సమాచార హక్కు చట్టం కింద ఎదురైన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కోవిడ్ […]