Women’s World Cup: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు.. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-భారత్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించారు.. మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు.. వెస్టిండీస్ బ్యాటర్ అనిసా మహ్మద్‌ను ఔట్ చేయడంతో ఈ రికార్డు కెక్కారు గోస్వామి.. ఇప్పటి వరకు అత్యధిక వికెట్ల రికార్డు ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్‌స్టన్ (39 వికెట్లు)గా ఉండగా.. ఆమెను వెనక్కినెట్టి 40 వికెట్ల తీసి.. కొత్త చరిత్ర లికించింది.
Read Also: MLA Car: జనం పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. ఒకరు మృతి, ఎమ్మెల్యేపై దాడి..
Also Read
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్‌లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
ఇక, ఇప్పటి వరకు అత్యధిక వికెట్ల రికార్డు సాధించిన ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్‌స్టన్ 20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 39 వికెట్లు తీయగా.. ఝులన్ గోస్వామి మాత్రం 31 వన్డేల్లో ఆ రికార్డును బద్దలు కొట్టింది. మరోవైపు, ఇప్పటి వరకు 5 ప్రపంచ కప్‌లు ఆడిన గోస్వామి వన్డే ఫార్మాట్‌లో 198 మ్యాచ్‌ల్లో 249 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతుండడంతో మరోవిశేషం. మొత్తంగా హామిల్టన్ వేదికగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఝులన్ గోస్వామి ఐసీసీ మహిళల ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించింది. వెస్టిండీస్‌పై 36వ ఓవర్‌లో గోస్వామి రికార్డు వికెట్ పడగొట్టారు. కాగా, టీమిండియా ప్రారంభ మ్యాచ్‌లో, ఆమె అద్భుతమైన బౌలింగ్‌తో 2/26తో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో కీలక భూమిక పోషించారు.
- Tags
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!