లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో అక్కడికక్కడే నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒడిశాలో కలకలం రేపుతోంది.. ఒడిశా ఖుర్దాలో ప్రజలపైకి దూసుకెళ్లింది ఎమ్మెల్యే ప్రశాంత్జగ్దేవ్కారు… ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 25 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలిపారు. గాయపడినవారిలో దాదాపు 15 మంది బీజేపీ కార్యకర్తలుగా తెలుస్తుండగా.. 10 మంది పోలీసు సిబ్బంది కూడా ఉన్నట్టు చెబుతున్నారు.. వారిని వెంటనే భువనేశ్వర్ఎయిమ్స్కు తరలించారు.
Read Also: EPFO: ఖాతాదారులకు భారీ షాక్..! వడ్డీ రేటు కోత..!
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖుర్దాలో పంచాయతీ సమితి చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతున్నాయి.. బాన్‌పుర్ బ్లాక్ కార్యాలయం ఎదుట.. ప్రజలు, బీజేపీ కార్యకర్తలు గుమ్మిగూడి ఉండగా.. బీజేడీ బహిష్కృత ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్ కారు వారికిపైకి దూసుకెళ్లింది.. 25 మందికి పైగా తీవ్ర గాయాలపాలు కావడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు.. ఆ వెంటనే ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు.. వాహనాన్ని ధ్వంసం చేశారు… ఎమ్మెల్యేను బటయకు లాగి దాడికి పాల్పడ్డారు.. ఈ సమయంలో సదరు ఎమ్మెల్యే మద్యం సేవించి ఉన్నట్టుగా చెబుతున్నారు స్థానికులు.. ఇక, వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ దాడి నుంచి ఎమ్మెల్యేను కాపాడి.. ఆస్పత్రికి తరలించారు.. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రజలు ఎమ్మెల్యేను తీవ్రంగా కొట్టడంతో.. మొదట తంగి ఆసుపత్రిలో చేరిన తరువాత భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఖుర్దా ఎస్పీ అలేఖ్ చంద్ర పాహి మీడియాకు తెలిపారు.. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎన్నికల ర్యాలీలో బీజేపీ మద్దతు ఉన్న పంచాయతీ సమితి సభ్యులు బ్లాక్ కార్యాలయంలోకి ప్రవేశిస్తుండగా, అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వాహనం వారిపైకి దూసుకెళ్లినట్టు చెబుతున్నారు.. ఈ ఘటనలో బాణాపూర్ ఐఐసీ, ఎమ్మెల్యే, జర్నలిస్టు సహా పది మంది పోలీసులు, కనీసం ఆరుగురికి గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. కాగా, సెప్టెంబర్‌లో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బిజెడి) ఎమ్మెల్యే అయిన జగదేవ్… తన నియోజకవర్గంలో బీజేపీ నేతను కొట్టిన వీడియో వైరల్ కావడంతో అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.