Election Results: 5 రాష్ట్రాల ఫలితాలు ఏపీకి నష్టం.. సీఎం జగన్‌కు మరింత భయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.. ఇక, ఈ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ సమావేశం జరిగింది.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీకి నష్టం అన్నారు.. ఈ ఫలితాలు చూసి సీఎం జగన్ మరింత భయపడతారని జోస్యం చెప్పిన ఆయన.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారన్నారు.. బీజేపీ బలపడే కొద్దీ తనపై ఉన్న కేసులతో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో సీఎం జగన్ ఉంటారన్న ఆయన.. జగన్ పై ఉన్న కేసుల భయంతో రాష్ట్రానికి రావాల్సిన హక్కులను వైసీపీ ఎంపీలు సైతం అడగలేరని ఆరోపించారు.
Read Also: AP: కొత్త జిల్లాల ఏర్పాటు.. దూకుడు పెంచిన ప్రభుత్వం
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై 28 మంది ఎంపీలున్నా వైఎస్ జగన్ ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని మండిపడ్డారు రామ్మోహన్‌నాయుడు.. అనేక రాష్ట్రాల్లో విజయం సాధిస్తున్న బీజేపీ.. ఏపీలో ఎందుకు బలపడట్లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.. ఏపీ ప్రజలకు బీజేపీ చేయాల్సిన న్యాయం చేయలేదు కాబట్టే ఇక్కడ 1శాతం ఓటు కూడా రావట్లేదన్న ఆయన.. సంఖ్యా బలం తక్కువ ఉన్నా టీడీపీ ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయనే వాదనలో నిజం లేదన్న టీడీపీ ఎంపీ.. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల సాధనలో వైసీపీపై ఒత్తిడి తెచ్చి హామీలు గుర్తు చేస్తామన్నారు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని కొరతామన్న ఆయన.. కేంద్ర నిధులు దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరును పార్లమెంట్‌లో లేవనెత్తుతామని వెల్లడించారు. సర్పంచుల నిధులు కూడా దుర్వినియోగం చేసి జగన్ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు హోంశాఖ చొరవ చూపాలని కోరతామని తెలిపారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!