తెలంగాణలో ఒంటిపూట బడులకు సమయం ఆసన్నమైంది.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.. ఇక, ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ.. ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిగంటలుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది… ఇక, మే 20వ తేదీన 10వ తరగతులు ముగియనున్నాయి.. అంటే, అదే రోజు స్కూళ్లకు చివరి పనిదినం కానుంది. ఇక, జూన్ 12వ తేదీ నుండి కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కానుంది. అప్పటి వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు.
Read Also: Women’s World Cup: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్