రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం.. రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది.. మూడో విడతలో మొత్తం 50,58,489 మంది రైతుల ఖాతాల్లో రూ.1,036 కోట్లు జమ చేయనున్నారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. Read Also: సీఎం జగన్ హస్తినబాట.. ప్రధానితో భేటీకి ప్రాధాన్యత..! 2021–22 సీజన్లో […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు హస్తిన వెళ్లనున్నారు.. ఇవాళ ఉదయం పదిన్నరకు తాడేపల్లి నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం జగన్.. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల పరిష్కారానికి ప్రధానిని అభ్యర్థించనున్నారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం.. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు వంటి అంశాలను వారి వద్ద ప్రస్తావిస్తారని […]
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ సాగుతోంది.. భారత్‌లోనూ ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తిచేశారు.. సెకండ్ డోస్ వేస్తున్నారు.. ఇక, టీనేజర్లకు కూడా టీకా వేసేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]
ఈ నూతన సంవత్సరంలోనైనా కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసిన నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్‌తో మహమ్మారి మరో మారు విజృంభిస్తున్న వేళ అందరూ మరింత బాధ్యతతో మెలుగుతూ పూర్తి శక్తి సామర్థ్యాలతో రోగులకు సేవలు అందేలా […]
సినిమా టికెట్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది.. సినీ ప్రముఖుల నుంచి వివిధ రాజకీయ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఈ వ్యవహారంలో కామెంట్లు చేయడంతో పెద్ద రచ్చే జరుగుతోంది.. ఇక, సినిమా టికెట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే, సినిమా టికెట్ల విష్యూపై సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును లాంఛనంగా […]
తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది అంటూ ప్రశంసలు కురిపించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇవాళ చాలా సంతోషంగా ఉంది.. కరోనా నేపథ్యంలో అందరూ భౌతికదూరం తోపాటు మాస్క్ ను ధరించాలని సూచించారు.. Read Also: నేరుగా గవర్నర్ దృష్టికి సమస్యలు.. రాజ్ భవన్లో […]
కొత్త సంవత్సరం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. ఇవాళ రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆమె.. కేక్ కట్ చేశారు.. ఇక, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడంపై ఫోకస్ పెట్టారు.. దాని కోసం రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా ఓ బాక్స్ ఏర్పాటు చేశారు.. రాజ్ భవన్ గేట్ దగ్గర ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశారు.. ఈ రోజు నుండి రాజ్‌భవన్ గేటు దగ్గర […]