పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటుండగా జరిగిన ఓ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతిచెందింది.. పిల్లల ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.. వెంటనే బాలికను ఉస్మానియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసిన అప్పటికే మృతిచెందినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం బాలిక శాండ్వి మృతిదేహం ఉస్మానియా ఆస్పత్రిలో ఉంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జిన్నారం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది…
Read Also: AP Assembly: టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు