TS Inter Exams: మారిన ఇంటర్ పరీక్షల తేదీలు.. కొత్త షెడ్యూల్ ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గతంలో ప్రకటించిన ఇంటర్ పరీక్షల తేదీలు మారిపోయాయి.. జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చనున్నట్టు.. నేడో.. రేపో కొత్త షెడ్యూల్ వస్తుందంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించింది ఇంటర్ బోర్డు.. ఇక, ఏప్రిల్ 22 నుండి జరగాల్సిన పరీక్షలు… మే 6 నుండి ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు.. తెలంగాణలో మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు తన ప్రకటనలో పేర్కొంది ఇంటర్ బోర్డు.
Read Also: Supreme Court: హిజాబ్ వివాదం.. మాకు సమయం ఇవ్వండి..
Also Read
ఫస్టియర్ షెడ్యూల్: మే 6న సెకండ్ లాంగ్వేజ్, 9న ఇంగ్లీష్, 11న మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్, 13న మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ, 16న ఫిజిక్స్, ఎకనామిక్స్, 18న కెమిస్ట్రీ, కామర్స్, 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1, 23న మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి.
సెకండియర్ షెడ్యూల్: మే 7న సెకండ్ లాంగ్వేజ్, 10న ఇంగ్లీష్, 12న మ్యాథ్స్-2ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్, 14న మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ, 17న ఫిజిక్స్, ఎకనామిక్స్, 19న కెమిస్ట్రీ, కామర్స్, 21న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2, 24న మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి.

తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!