జగనన్న విద్యాదీవెన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి విద్యాదీవెన కార్యక్రమం కింద విద్యార్థుల తల్లుల అక్కౌంట్లకు నగదు బదిలీ చేశారు సీఎం.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 10.82 లక్షల మంది విద్యార్ధులకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి రూ.709 కోట్ల రూపాయలు పిల్లల తల్లుల ఖాతాలలోకి జమ చేసినట్టు వెల్లడించారు.. 100 శాతం లిటరసీ ఉన్న సమాజాలు ఎలా ఉంటాయో గమనించాలన్న యాన.. విద్య ఉన్న కుటుంబాలకు, విద్య లేని కుటుంబాలకు చాలా తేడా ఉంటుంది.. చదువుకు పేదరికం అడ్డు రాకూడదు.. ఫీజు రియింబర్స్ మెంట్‌మీద ఎప్పుడు మాట్లాడినా నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన నా కళ్లముందు కనిపిస్తూ ఉంటుందన్నారు.. చదువులు కారణంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పుడూ రాకూడదన్న ఏపీ సీఎం.. ఈ విషయాలను గట్టిగా నమ్మిన వ్యక్తి నాన్నగారని గుర్తుచేస్తున్నారు.
Read Also: Telangana: విషాదం.. ఫామ్‌హౌస్‌లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదలకోసం గతంలో నాయకులు కేవలం మాటలు మాత్రమే చెప్పేవారు.. కానీ, నాన్న (వైఎస్ రాజశేఖర్‌రెడ్డి)గారు పూర్తి రీయింబర్స్‌మెంట్ తీసుకు వచ్చారని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. తర్వాత వచ్చిన వారు అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉండేదని.. మొత్తం స్కీంను నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు స్కీమ్‌ను మనం వచ్చాక బాగా మార్పు చేశాం.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన వారందరికీ కూడా పూర్తి ఫీజురియింబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం అన్నారు. ఎలాంటి అరియర్స్ లేకుండా.. ప్రతి త్రైమాసికానికీ చెల్లిస్తున్నాం.. బోర్డింగ్ ఖర్చులు కూడా వసతి దీవెన కింద ఇస్తున్నామన్న ఆయన.. విప్లవాత్మక మార్పులతో అమలు చేస్తున్నాం.. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్ మెంట్ ఎలా ఉందని ఆలోచన చేయండి.. ఏ స్థాయిలో ఫీజులున్నా.. ఇచ్చేది కేవలం రూ.35వేలు అని ఎద్దేవా చేశారు.. 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి రూ.1770 కోట్ల రూపాయలను బకాయిలు పెట్టి వెళ్లారని మండిపడ్డ ఆయన.. అయినా పిల్లలకోసం వాటిని కూడా చెల్లించామని.. విద్యాదీవెన, వసతి దీవెనల కోసం మన ప్రభుత్వం అక్షరాల రూ.9,274 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వెల్లడించారు.. ఈ డబ్బులు ఇవ్వడమే కాకుండా మొదటసారిగా తల్లులఖాతాల్లోకి వేస్తున్నాం.. తల్లులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశాం.. మరో త్రైమాసికం రాకముందే.. చెల్లిస్తున్నాం.. ఎక్కడా ఇబ్బంది పడకుండా డబ్బులు ఇస్తున్నట్టు తెలిపారు.
తల్లులు వెళ్లి ఫీజులు కట్టడం మొదలుపెడితే… కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు సీఎం వైఎస్ జగన్.. అందుకే ఆ మొత్తాన్ని తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నాం.. వసతి దీవెన డబ్బులు కూడా తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నాం, రెండో విడత వసతి దీవెన ఏప్రిల్ 5న విడుదల చేస్తామని వెల్లడించారు. ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలను చదివించండి.. పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తాం.. పూర్తిగా వసతి దీవెన ఇస్తాం, పిల్లలు బాగా చదివితేనే వారు పోటీప్రపంచంలో నిలబడగలరు అన్నారు.. పిల్లలకు మంచి మేనమామగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లకు ఆరున్నర లక్షలమంది ప్రైవేటునుంచి వచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్న సీఎం.. ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు..