మేషం : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు మొండివైఖరి అవలంబించుట వల్ల మాటపడక తప్పదు. తోటలు కొనుగోలుకై చేయుప్రయత్నాలు వాయిదాపడుట వల్ల ఆందోళన చెందుతారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు రావలసిన ధనం చేతికందుతుంది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా […]
ఏపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర విభజన కంటే వైఎస్ జగన్ చేసిన డామేజ్ నుంచి రాష్ట్రం కోలుకోవడం చాలా కష్టం అన్నారు.. కరోనా వైరస్‌కి మందుందేమో కానీ.. జగన్ వైరస్‌కి మందు లేదని మండిపడ్డారు.. ఏపీ అప్పు రూ. 7 లక్షల కోట్లకు చేరిందన్న బాబు.. ఉద్యోగులకు చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనంత ఫిట్మెంట్ టీడీపీనే ఇచ్చిందన్నారు.. చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం […]
తెలంగాణలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి… ఇవాళ మధ్యాహ్నం వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్, వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.. ఇక, ఊహించని ఘటనలో భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.. దమసాపూర్, భుచ్చన్‌పల్లి, మర్పల్లి గ్రామల్లో కూడా భూమి కంపించినట్టు చెబుతున్నారు.. ఇక, ఈ సమయంలో భూమి నుంచి భారీ శబ్ధాలు వచ్చినట్టు తెలుస్తోంది.. భూమి కింది […]
ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెడతారా? అంటూ ఎదురైన ప్రశ్నపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించిన తీరు.. ఇటు తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చగా మారింది.. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడైనా పెడతాం.. అక్కడ పెట్టకూడదని ఏమైనా రూల్ ఉందా? అంటూ ఎదురుప్రశ్నించిన కాకరేపారు వైఎస్ షర్మిల.. అయితే, ఆమె వ్యాఖ్యలపై ఇవాళ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ షర్మిల ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చన్నారు.. […]
మరోసారి టీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన.. తెలంగాణలో అవినీతి దేశంలో ఎక్కడ లేదని జేపీ నడ్డా చెబుతున్నారు.. మరీ, ఆ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదు? అని ప్రశ్నించారు. Read Also: కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విమాన చార్జీలు..! ఢిల్లీ నుంచి తెలంగాణకు […]
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావం చూపింది… అయితే, కోవిడ్ ఆంక్షలు పెట్టే అవకాశం ఉందంటూ ముందుగా పోటీపడి స్వదేశాలకు, సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి భారీగా ఖర్చు చేశారు.. ఆ సమయంలో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.. అన్ని దేశాలు ఆంక్షల బాట పడుతున్న సమయంలో.. విమానాలు ఎక్కేవారు లేక.. చార్జీలు తగ్గిపోయాయి.. ఇదే సమయంలో.. భారత్-యూఏఈ మధ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా విమాన చార్జీలు పడిపోయాయి.. సాధారణ సమయాల్లో దుబాయ్ […]
ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయం కొత్త కాదు.. కానీ, మరోసారి కులరాజకీయం తెరపైకి వస్తోంది.. తాము అంటే తామేనని ప్రకటిస్తున్నారు నేతలు.. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. కాపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందన్న ఆయన.. కాపులకు న్యాయం జరిగేది బీజేపీతోనే అని ప్రకటించారు.. ఇక, ప్రజాగ్రహ సభ తర్వాత టీడీపీ, బీజేపీల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయని చెప్పుకొచ్చారాయన.. భారతీయ జనతాపార్టీది సబ్ కా సత్ సబ్ కా వికాస్ […]
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా కొనసాగుతోన్న పీఆర్సీ ఎపిసోడ్ క్లైమాక్స్‌కి చేరినట్టుగా తెలుస్తోంది.. ఆందోళనకు దిగిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వ విజ్ఞప్తితో మళ్లీ విధుల్లోకి హాజరయ్యారు.. కానీ, ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీపై ప్రకటన మాత్రం రాలేదు.. చర్చలు కొనసాగుతూనే ఉన్నా.. ప్రకటన రాకపోవడంతో.. మళ్లీ ఉద్యమానికి సిద్ధం అయ్యారు ఉద్యోగులు.. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. పీఆర్సీ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరినట్టు తెలుస్తోంది.. ఉద్యోగులకు సంక్రాంతి కానుగా పీఆర్సీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. […]
తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి.. కొందరు ఏకగ్రీవంగా ఎన్నికైతే.. మరికొన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి.. మరోవైపు నిన్నటి(డిసెంబర్ 4వ తేదీ 2022)తో 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసిపోయింది.. దీంతో.. నేటి నుంచి కొత్తగా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ప్రారంభం కానుందని.. నేటి నుంచి ఆరు సంవత్సరాల పాటు కొత్తగా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీలు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ప్రకటించింది.. Read Also: […]
ఎన్నో బ్యాంకులు పుట్టుకొచ్చాయి.. అందులో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి.. ఇక, ఈ మధ్య చాలా బ్యాంకుల విలీనం కూడా జరిగిపోయింది.. అయితే, బ్యాంకుల పరిస్థితిపై ఆర్బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), మరోవైపు ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక బ్యాంకులుగా పేర్కొంది.. అవి డీ–ఎస్ఐబీలు లేదా సంస్థలుగా కొనసాగుతాయని ఒక ప్రకటనలో పేర్కొంది ఆర్బీఐ.. […]