టెన్నిస్ స్టార్ జకోవిచ్‌కు షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం… జకోవిచ్ వీసాను రెండోసారి రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ టెన్నీస్ స్టార్‌పై మూడేళ్లపాటు నిషేధం విధించింది ఆసీస్.. కరోనా నిబంధనలు పాటించనందుకు వీసా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఇటీవలే మెల్బోర్న్ వెళ్లారు జకోవిచ్.. అయితే, అనూహ్యంగా ఎయిర్పోర్ట్ నుంచే జకోవిచ్‌కు వెనక్కి పంపించారు అధికారులు.. తాజాగా, మరోసారి వీసాను రద్దు చేయడంతో.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్ పాల్గొనే అవకాశం లేకుండా […]
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సమయం ఆసన్నమైంది.. కేంద్ర బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది.. ఈ సారి కూడా రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు మొదటి విడత బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు రెండో విడత బడ్జెట్ సెషన్ నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.. ఇక, కేంద్ర బడ్జెట్ 2022-23ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో […]
మరోసారి కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది… ప్రపంచదేశాల వెన్నులో వణుకుపుట్టిస్తోంది.. భారత్ సహా అనేక దేశాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు 31 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.. తాజాగా గణాంఖాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో.. 31,86,254 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 7,606 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 32 కోట్ల మార్క్‌ను కూడా […]
కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది… సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్న వారిపైనా కరోనా అటాక్ చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ […]
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. మూడు రోజుల్లోనే ఏకంగా ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. బీజేపీ కూటమి నుంచి 11 మంది ఎమ్మెల్యేలు వైదొలగగా… ఇక, బీజేపీకి చెందినవారే యోగి ఆదిత్యానాథ్ కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీకి కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు […]
కరోనా మళ్లీ భారత్‌ను వణికిస్తోంది.. థర్డ్ వేవ్ దెబ్బకు రికార్డు స్థాయిలో రోజువారి కేసులు పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు విధిస్తున్నాయి.. మరోవైపు, వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ కోవిడ్ నిబంధనలు తప్పితే.. అదనంగా ఎలాంటి ఆంక్షలు లేవు.. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు నెటిజన్లు.. […]
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్ వేరియంట్‌గా పంజా విసురుతోంది.. దీంతో.. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది… రోజుకో రికార్డు తరహాలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ కలవరపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 315 మరణాలు నమోదు, ఇక, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12,72,073కు చేరింది.. […]
వైద్య రంగంలోకి కొన్ని అద్భుతమైన ఘట్టాలు వెలుగుచూస్తూ ఉంటాయి.. దేనికోసమో తయారు చేసిన మందు.. మరో రోగాన్ని నయం చేస్తుంది.. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక జుట్టు పీకోవాల్సిన పరిస్థితులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఎన్నో.. తాజాగా, అలాంటి ఘటనే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.. ప్రపంచం వెన్నులో వణుకుపుట్టిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు తయారు వేస్తున్న వ్యాక్సినేషన్‌తో.. మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి అమాంతం లేచి నిలబడ్డాడు.. నోట మాటలు రాని ఆ […]