Astrology: మార్చి 26, శనివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: ఈ రోజు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. రుణ విముక్తులు కావటంతో పాటు కొత్త రుణ యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించటం మంచిది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. వ్యవహారాల్లో జయం, సమర్థతకు గుర్తింపు పొందుతారు.
వృషభం : ఈ రోజు ఈ రాశివారి కుటుంబీకుల మధ్య ఒక శుభకార్య విషయం ప్రస్తావనకు వస్తుంది. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. నిశ్చితార్థం, గ్రహ ప్రవేశాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది. బాగా శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు.
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. మీ విషయాల్లో ఇతరుల జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. పాత మిత్రుల కలయికతో మీలో మార్పు వస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. క్యాటరింగ్ పనివారలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని విద్యార్థులు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోవటం మంచిది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఆస్తి, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
సింహం : ఈ రోజు ఈ రాశివారు స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన వాయిదా వేయటం మంచిది. అనుకున్నపనులు ప్రణాళికా బద్ధంగా పూర్తి కాగలవు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత అవసరం. రావలసిన ఆదాయంలో కొంత మొత్తమైనా అందుతుంది.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు అనవసర భయాందోళనలు విడనాడి శ్రమించి సత్ఫలితాలు లభిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి లోనవుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి తప్పదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు.
తుల : ఈ రోజు ఈ రాశివారికి అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. మీ సంతానం కోసం కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపులభిస్తుంది. బంధుమిత్రుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. దుబారా నివారించాలన్న మీ యత్నం నెరవేరదు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక స్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు చుట్టు ప్రక్కల వారి నుండి ఆదరణ లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు.
మకరం : ఈ రోజు ఈ రాశివారికి ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఖర్చులు రాబడికి తగినట్లుగానే ఉంటాయి. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. తీర్థయాత్రలు, విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు అధికం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఏకాగ్రత అవసరం. ఎదుటివారి విషయాలు దూరంగా ఉండటం క్షేమదాయకం.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని పోస్టల్, ఎస్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. సోదరుల మధ్య అవగాహన లోపిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం, తరచూ విందులు వంటి శుభపరిణామాలుంటాయి. చేపట్టిన పనుల హడావుడిగా పూర్తి చేస్తారు.
తాజావార్తలు
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
-
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!