ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.. ఇదే సమయంలో.. ప్రక్షాళన ప్రారంభించారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ… ఈ పరిణమాలపై ఢిల్లీలో స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. సోనియా గాంధీ ప్రక్షాళన ప్రారంభించారు.. ఆమెకు నా అభినందనలు.. ఇది శుభసూచకం అన్నారు.. రేపు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సోనియా సమావేశం అవుతున్నారు… తెలంగాణలోని పరిణామాలను కూడా సోనియా గాంధీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించిన ఆయన.. తెలంగాణ కు చెందిన సీనియర్ నాయుకులను కూడా పిలిచి సోనియా గాంధీ మాట్లాడాలన్నారు.
Read Also: Ukraine Russia War: ఆగని బాంబుల వర్షం.. మరుభూమిగా మారిన ఉక్రెయిన్..
ఇక, తాజాగా, హాట్ టాపిక్‌గా మారిన జగ్గారెడ్డి ఎపిసోడ్‌పై స్పందించిన వీహెచ్.. జగ్గారెడ్డి తప్పు ఏమీ లేదన్నారు.. గాంధీ భవన్ లో కొంత మంది రెచ్చగొట్టే విధంగా మాట్లాడి నందుకు ఆయన భాగోధ్వేగానికిలోనై మాట్లాడరన్న వీహెచ్.. సీనియర్ నేతల సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు తీర్మానం చేశాం అన్నారు.. పార్టీకి వ్యతిరేకంగా సీనియర్ నేతలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.. పది సంవత్సరాలుగా తెలంగాణ లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై వ్యతిరేకతను కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని.. టీఆర్‌ఎస్, బీజేపీ కంటే మెరుగైన కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేపట్టాలని సూచించారు వీహెచ్.