ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. అభ్యంతరాలను స్వీకరిస్తోంది.. కొత్త జిల్లా కేంద్రాలు, పేర్లపై పలు విమర్శలు, విజ్ఞప్తులు వస్తున్నాయి.. కొందరి నుంచి ప్రశంసలు కూడా లభిస్తున్నాయి.. అయితే, కొత్త జిల్లాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్రకాశం జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా మార్చడం అభినందనీయం అన్నారు.. ఎన్టీఆర్ పేరుని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విస్మరించారని మండిపడ్డ […]
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సమ్మె అన్ని విభాగాలను తాకుతోంది.. ఓవైపు ప్రభుత్వం చర్చలు అంటుంటే.. మరోవైపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇక, పాత పే స్కేల్‌ను ఉద్యోగులు కోరుతుంటే.. కొత్త పే స్కేల్ ప్రకారమే చెల్లింపులు చేస్తామంటోంది ప్రభుత్వం.. అయితే, వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయని అధికారులపై చర్యలకు ఉపక్రమించింది ఆర్ధిక శాఖ.. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ ఆదేశాలు […]
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగం బ్యాకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.. గర్భిణీ ఉద్యోగుల విషయంలో ఎస్బీఐ కొత్తగా జీరా చేసిన సర్క్యులర్‌పై వివాదం మొదలైంది.. దీనిపై స్పందించిన ఉమెన్ కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.. ఇక, వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశారు.. అయితే, అన్ని రకాల నుంచి వివాదులు చుట్టుముట్టడంతో.. ఎస్బీఐ దిగొచ్చింది. […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. గత మూడు నాలుగు రోజులుగా మళ్లీ తగ్గుతూ వస్తుంది.. అయినా.. భారీగానే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 11,573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 22,60,181కు చేరుకోగా.. మృతుల సంఖ్య 14,594కి పెరిగింది.. ప్రస్తుతం […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.. సమాజ్‌వాది పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎస్పీ నేతలు తలకు పెట్టుకునే ఎరుపు టోపీనే టార్గెట్ చేసిన ఆయన.. ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను ఊచకోత కోశారని ఆరోపణలు గుప్పించారు.. ఇదే సమయంలో 1500 మందికి పైగా హిందువులను జైళ్లలో పెట్టారని.. సమాజ్‌వాదీ పార్టీ టోపీని అమాయక రామభక్తుల రక్తంతో పెయింట్ చేశారంటూ వ్యాఖ్యానించారు.. […]
ఒమిక్రాన్ ఎంట్రీతో దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభంమైంది.. ఇదే సమయంలో తెలంగాణలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.. ఈ నేపథ్యంలో.. సంక్రాంతి సెలవులు ముగుస్తున్న తరుణంలో సెలవులను జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, ఈ నెలతో సెలవులు ముగిసిపోనున్నాయి.. మరోవైపు.. ఆన్‌లైన్‌తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. తిరిగి ప్రారంభించాలనే డిమాండ్ కూడా ఉంది.. దీంతో.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభించేందుకు […]
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తల పెట్టిన సమ్మె వాయిదా వేశారు.. వేతన ఒప్పందం అమలు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు మొదట నోటీసులు ఇచ్చింది అఖిలపక్షం.. అయితే, కార్మిక సంఘాలతో ఇవాళ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్, ఆర్.ఐ.ఎన్. ఎల్.యాజమాన్యం చర్చలు జరిపింది.. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.. అయితే, ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు […]
కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు ఆటోమొబైల్ రంగంపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపింది.. అన్ని సంస్థల కార్ల విక్రయాలు మందగించాయి.. మరోవైపు.. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలను సైతం చిప్ కొరత, సప్లై చైన్ రంగం తీవ్రంగా దెబ్బ కొట్టాయి.. ఇవన్నీ ప్రతికూలంగా మారిపోయి.. గత ఏడాది ఆయా కంపెనీల ఉత్పత్తి పూర్తిగా పడిపోయిన పరిస్థితి.. కానీ, ఇదే సమయంలో కోటిపైగా కార్లను విక్రయించింది రిక్డాకెక్కింది జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా.. Read Also: ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్ […]
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాలు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పింది కెనడా సర్కార్.. భారత్ నుంచి నేరుగానైనా లేదా గల్ఫ్/యూరప్/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది కెనడా.. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత కట్టడి చర్యల్లో భాగంగా చాలా దేశాలు ఆంక్షల బాటపట్టాయి.. ముఖ్యంగా విదేశీ ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించాయి.. ఇదే సమయంలో.. కెనడా కూడా ఆంక్షలు విధించి.. ఆ […]
కరోనా ఎంట్రీ తర్వాత అందరూ తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చాయి.. మహమ్మారి బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం తినాలి.. కోవిడ్ బారినపడితే త్వరగా కోలుకోవడానికి ఏం తింటే మంచిది.. ఇంకా ఎలాంటి ఎక్సైజ్‌లు చేయాలి లాంటి అనేక టిప్స్‌ను సూచిస్తున్నారు నిపుణులు.. ఇక, కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు మరికొన్నిఆహార చిట్కాలు చెబుతున్నారు.. ముఖ్యంగా బాదం, కిస్మిస్లు, రాగులు, బెల్లం లాంటివి కోవిడ్ నుంచి త్వరగా […]