ముంబైలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ… శరద్‌పవార్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. బారికేడ్లు తీసుకొని లోపలికి వెళ్లారు. శరద్ ఇంటిపై చెప్పులతో దాడి చేశారు. గతేడాది నవంబర్ నుంచి సమ్మే చేస్తున్నా… శరద్ పవర్ పట్టించుకోలేదని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ఫైరవుతున్నారు కార్మికులు.
Read Also: Sri Ram Navami: భైంసాలో శోభాయాత్ర.. హైకోర్టు కీలక ఆదేశాలు..
కాగా, ప్రభుత్వ ఉద్యోగుల్లా గుర్తించాలంటూ… మహారాష్ట్ర ఆర్టీసీ కార్మికులు నవంబర్ నుంచి స్ట్రైక్ చేస్తున్నారు. పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేదు. ఏప్రిల్ 22లోపు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఇటు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన మహారాష్ట్ర రవాణశాఖమంత్రి… ఆర్టీసీ కార్మికులకు డెడ్‌లైన్ పెట్టారు. ఈనెల 22లోగా విధుల్లో చేరకుంటే… చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళనలు ఉధృతం చేశారు.