తగ్గినట్టే తగ్గిన చలి.. తెలంగాణలో మళ్లీ పంజా విసురుతోంది.. గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు సగటు కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదు అవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు అవుతున్నాయి.. జిల్లాలోని అర్లీ(టీ)లో 4.9 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రతలు.. కుమరంభీంలో 5.8, సిర్పూర్ (యు)లో 5.8, […]
కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచదేశాలను వణికిస్తూనే ఉంది.. 2019లో చైనాలో వెలుగుచూసిన కోవిడ్.. అతలాకుతలం చేస్తూనే ఉంది.. ఇక, ఇప్పటికే అనే అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి.. మరికొన్ని జరుగుతూనే ఉన్నాయి.. అయితే, కొన్ని స్టడీలు మాత్రం మహమ్మారికి సంబంధించిన అనేక సంచలన విషయాలు బటయపెడుతున్నాయి.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలు, లెక్కలకంటే ఎక్కువ కాలం మనుషుల శరీరంలో వైరస్ యాక్టివ్‌గా ఉంటుందని తాజాగా ఓ పరిశోధన బయపెట్టింది.. కోవడ్ పాజిటివ్‌గా తేలిన 14 రోజుల తర్వాత కూడా […]
మేషం : ఈ రోజు ఈ రాశివారి ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. మీ కళత్రం కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వ్యక్తిగత భావాలను బయటికి వ్యక్తం చేయకండి. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఫ్యాన్సీ, గృహోపకరణాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులలో […]
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి కార్మిక సంఘాలు.. ఓవైపు దేశవ్యాప్తంగా ఇంకా కరోనా థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉండడంఓ.. మరోవైపు.. ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానుండడం.. ఇక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతుండడంతో.. తన సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్టు పేర్కొన్నారు.. అయితే, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన సమ్మె […]
భారత్‌లో జరుగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. మినీ సమరాన్ని తలపిస్తున్నాయి.. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఎటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు చేపట్టకూడదని స్పష్టం చేసింది.. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మార్చి 7వ తేదీ […]
ప్రతీరోజు లక్షలాది మంది రోడ్లపైకి వస్తున్నాయి.. కార్లు, బైక్‌లు, ఇతర వాహనాల నుంచి వెలువడే కాలుష్యానికి తోడు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో వాయు కాలుష్యం ప్రపంచమంతటా పెరిగిపోతుంది. కాలుష్యానికి దూరంగా ఉన్న ప్రాంతాలు సైతం క్రమంగా దాని బారినపడిపోతున్నాయి.. దీంతో.. దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు.. ఇప్పటికే వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉండే ఢిల్లీలో.. నియంత్రణ కోసం కొన్ని చర్యలకు పూనుకుంది ఆమ్ఆద్మీ సర్కార్.. ఇప్పుడు మరింత కఠిన నిర్ణయాలను పూనుకుంటుంది.. దానిలో భాగంగా.. పొల్యుషన్ […]
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు గుంటూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది.. హైదరాబాద్ నుండి త్రిపురాంతకం వెళ్తుండగా.. మాచర్ల మండలం ఎత్తిపోతల సమీపంలో ప్రమాదం జరిగింది.. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఓవర్ టేక్ చేస్తూ వెనుకనుంచి ఢీకొట్టింది మరోకారు.. అయితే, ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయ్యింది.. ఎమ్మెల్యే కారుమూరి సురక్షితంగా బయటపడ్డారు.. మరో వాహనంలో త్రిపురాంతకం వెళ్లిపోయారు […]
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శైవక్షేత్రాలు అప్పుడే సిద్ధం అవుతున్నాయి.. ఇక, మహాశివరాత్రి అనగానే ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం గుర్తుకు వస్తుంది.. శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.. ఇక, శ్రీశైలంలో పిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు వెల్లడించారు.. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కర్నూలు, ప్రకాశం, గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాల […]