YS Jagan: దూకుడు పెంచిన ఏపీ సీఎం.. వ్యూహం మారిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మధ్య దూకుడు పెంచారు.. ఓవైపు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టిసారించిన ఆయన.. పాత మంత్రుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి.. ఎవ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి.. కొత్తవారు ఎవరైనా మంత్రులుగా బెటర్, సామాజిక సమీకరణలతో ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనే విషయాలపై కసరత్తు చేస్తున్నారు.. మరోవైపు ప్రత్యర్థులపై పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. గత రెండ్రోజులు నుంచి బహిరంగ సభల్లో విమర్శల ధోరణి మార్చారు. హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత విపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.. అయితే, ఈ దూకుడు వెనుక వ్యూహం ఏమైనా ఉందా? అనే చర్చ సాగుతోంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
ముఖ్యమంత్రి మాటల్లో వాడి, వేడి పెరిగింది. ప్రత్యర్ధులపై విమర్శల్లో దూకుడు పెంచారు. నర్సరావుపేట బహిరంగ సభలో ప్రతిపక్షాలపై హాట్ కామెంట్లు చేశారు సీఎం. అసూయతో రగిలిపోతే తొందరగా బీపీ వస్తుందని, టికెట్ తీసుకుంటారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగనన్న వసతి దీవెన కార్యక్రమం కోసం నంద్యాల వెళ్లిన సీఎం బహిరంగ సభలో మరో అడుగు ముందుకు వేశారు. దేవుడి దయ, ప్రజల దీవెన ఉంటే తనని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.. అంతెందుకు.. ఏమీ పీకలేరని కూడా వ్యాఖ్యానించారు.. అయితే, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ స్పీచ్‌లను ఇప్పుడు పార్టీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు జగన్ దాదాపుగా ఆచితూచి మాట్లాడుతూ వచ్చారు. వచ్చే రెండేళ్లు పార్టీని, ప్రభుత్వాన్ని ఎన్నికల దిశగా నడిపించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న జగన్… బహిరంగ సభల్లోనూ.. ఉపన్యాసాల్లో రాజకీయ విమర్శలు ప్రారంభించారని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శల్లో పదను పెంచి ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్తున్నట్లు భావిస్తున్నారు. అటు కార్యకర్తలు, కిందిస్థాయి నాయకుల్లోనూ జోష్ పెరుగుతుంది. ఈ అన్ని లెక్కలు వేసుకునే సీఎం జగన్ ఉపన్యాసాల శైలి మార్చారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక, సీఎం వైఎస్ జగన్ ప్రస్టేషన్‌లో ఉన్నారని.. అందుకే ఊగిపోతున్నారంటూ విమర్శలు గుప్పించేవారు కూడా లేకపోలేదు.
తాజావార్తలు
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!