కొత్త ఏడాది వచ్చింది.. కొత్త క్యాలెండర్ల ఆవిష్కరణ కొనసాగుతూనే ఉంది.. ఇక, జీవితానుభవాలను కవిత్వంగా మలిచి, ఆ కవిత్వాన్ని మంచిమాటలుగా మార్చి, కొటేషన్ల రూపంలో ప్రతి ఏటా క్యాలెండరుగా అందించే కవి కొత్త శ్రీనివాస్ రూపొందించిన 2022 క్యాలెండరును ఆవిష్కరించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ప్రగతిభవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా క్యాలెండర్ రూపకర్త, రచయిత కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ “మహాకవి శ్రీశ్రీ అన్నట్లు “మానవ జీవితమే ఒక మహాభారతం – అది మంచి చెడుల […]
క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం మరోసారి కలకలం సృష్టిస్తోంది.. జింబాబ్వే జట్టు కెప్టెన్‌గా, ఆ జట్టు తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన స్టార్ క్రికెటర్‌గా రికార్డులు సృష్టించిన జింబాబ్వే జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ వేటు వేసింది.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డానంటూ ఒప్పుకున్న టేలర్‌పై ఐసీసీ బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌లో మూడున్నరేళ్లు బ్యాన్ విధించగా.. ఇక, డోప్ టెస్ట్‌లో విఫలమైనందుకు ఒక నెల సస్పెన్షన్‌ను కూడా విధించింది. […]
ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన తర్వాత క్రమంగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) రూల్స్- 1954 కి కేంద్రం చేసిన సవరణ ప్రతిపాదనలు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మధ్య చిచ్చురేపాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రధాని నరేంద్ర మోడికి లేఖలు కూడా రాశారు.. మధ్యప్రదేశ్, […]
కేంద్రం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మా అవార్డుల్లో తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెర కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు భారీ సాయాన్ని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌లోని నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు.. ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటిని ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య.. ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.. ఈ సందర్భంగా మొగిలయ్యను […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదనపు అప్పు పొందేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు గానూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్థాన్‌కు కూడా అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.7,309 కోట్ల అదనపు అప్పులు తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,123 కోట్లు, రాజస్థాన్‌కు రూ.5,186 కోట్లు అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్లు పేర్కొంది. 2021-22 […]
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా 1,01,812 శాంపిల్స్ పరీక్షించగా.. 3,877 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు కన్నుమూయగా.. ఇదే సమయంలో 2,981 మంది కోవిడ్ నుంచి పూర్థిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 7,54,976కు చేరగా.. రికవరీ కేసులు 7,10,479కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు మృతిచెందినవారి […]
ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత కరోనా థర్డ్ వేవ్ భారత్‌లో కోవిఢ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.. […]
ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. యూపీలోని ఓ నియోజకవర్గంలో ఒకే స్థానంలో ఒకే పార్టీ నుంచి ఓ మంత్రి, ఆమె భర్త పోటీ పడుతుండగా.. గోవాలో ఓ సీనియర్ నేత, మాజీ సీఎం.. తన కోడలిపై బరిలో ఉండలేక పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో ఇక ఎన్నో చిత్రాలు జరుగుతున్నాయి.. తాజాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ నామినేషన్ వేశారు.. […]
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. ఇదే సమయంలో.. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సంఖ్య కూడా తగ్గిపోయింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,635 శాంపిల్స్ పరీక్షిచంగా.. 12,561 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో 10 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. విశాఖలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరులో ఇద్దరు చొప్పున, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు […]