ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ.. రికరింగ్ డిపాజిట్ పెట్టుబడులపై 5.1 శాతం నుండి 5.4 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక, సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం ఎక్కువ ఉంటుందని పేర్కొంది.. సవరించిన వడ్డీ రేట్లు జనవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు ఎస్బీఐ తెలిపింది.. కేవలం 100 రూపాయల […]
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. Read Also: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వడ్డింపు మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.. గాంధీ చిత్ర పటానికి […]
కొత్త ఏడాదిలో అడుపెట్టాం.. జనవరి నెల కూడా పూర్తి కావొచ్చింది.. ఎల్లుండి నుంచి ఫిబ్రవరి మాసం ప్రారంభం కానుంది.. ఇప్పటికే కొత్త ఏడాదిలో కొత్త ఛార్జీలను అమలు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద బ్యాకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ.. ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచబోతోంది.. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ వడ్డించనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అయితే, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రొత్సహించేందుకే ఎస్బీఐ […]
భారతదేశంలోని వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ.. పౌరులకు అభినందనలు తెలియజేశారు.. దేశ జానాభాలో మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ సాధించినందుకు సహకరించిన మా తోటి పౌరులకు అభినందనలు.. మా టీకా డ్రైవ్ను విజయవంతం చేస్తున్న అందరికీ ఇది గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.. దేశంలోని వయోజన జనాభాలో 75 శాతానికి పైగా ఇప్పుడు […]
ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు వ్యవహారం కొన్ని ప్రాంతాల్లో కాకరేపుతోంది.. జిల్లాల పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.. జిల్లా కేంద్రాలను కూడా మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.. ఇక, విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.. విశాఖలో మీడియాతో మాట్లాడిన వంగవీటి రాధ, రంగా రీ ఆర్గనైజషన్ సభ్యులు గాదె బాలాజీ… బెజవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని సీఎం వైఎస్ జగన్ను కోరారు.. ఈ విషయంపై చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా స్పందించాలని […]
అమర జవాన్ జ్యోతి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. రాయ్పూర్లోని ఛత్తీస్గఢ్ సైనిక బలగాల 4వ బెటాలియన్ పరిసర ప్రాంతంలో అమర జవాన్ జ్యోతిని నిర్మించతలపెట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఆ అంశంపై మాట్లాడినా సీఎం బాఘేల్.. అమర సైనికులకు నివాళిగా నిర్మాణాన్ని తలపెట్టాం.. దీనికి గురువారం రోజు రాహుల్ గాంధీ భూమి పూజ చేస్తారని ప్రకటించారు.. భారత దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తుచేసిన ఆయన.. […]
కరోనా విజృంభణతో కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో మూతపడిన స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.. మహారాష్ట్రలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కాబోతున్నాయి.. 1 నుంచి 8 తరగతులకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, కర్ణాటకలోనూ రాత్రి కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రభుత్వం.. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి విద్యాసంస్థలను రీఓపెన్ చేసేందుకు సిద్ధం అవుతోంది.. దీంతో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో తరగతులను శుభ్రం చేసే పనుల్లో పడిపోయారు.. రేపటి […]
ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు దుండగులు.. తిరుపతి సమీపంలో జనసేన కార్యకర్త సుహాన్ భాషాను అత్యంత కిరాతకంగా నరికి కత్తులతో నరికి చంపారు.. తిరుపతిలోని పేరూరు చెరువు వద్ద భాషాపై దాడి చేసి హతమార్చారు.. మృతుడు గాంధీపురానికి చెందిన సుహానా భాషాగా గుర్తించారు.. సమాచారం అందుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఇక, స్థానిక నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సుహాన్ భాషాను హత్య చేసి […]