శ్రీరామ నవమి వచ్చేస్తోంది… అయితే, ఈ సందర్భంగా నిర్వహించే శోభాయాత్రపై అంశం హైకోర్టుకు చేరింది… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ మధ్య చోటుచేసుకున్న కొన్ని ఘటన నేపథ్యంలో.. భైంసాలో శోభాయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో, హైకోర్టు మెట్లెక్కింది హిందూ వాహిని సంస్థ.. ఇక, కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతివ్వకపోవడంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. భైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రపై ఆదేశాలు జారీ చేసింది.. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతిచ్చినట్లు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేశారు పోలీసులు.. అయితే, పోలీసుల మార్గదర్శకాల ప్రకారమే శోభాయాత్ర నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శోభాయాత్ర నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు.. పోలీసులు అనుమతించిన మార్గాల్లోనే శోభాయాత్ర నిర్వహించాలని స్పష్టం చేసింది.
Read Also: TRS: ఆందోళనలు ఉధృతం.. ఇక, ఢిల్లీలో ధర్నా