IPL 2026: ఐపీఎల్‌కు ముందు ఫ్యాన్స్‌కు షాక్.. ఆర్సీబీ vs ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో బిగ్ ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: బీసీసీఐ తాజాగా ఈ సీజన్‌కు సంబంధించి ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. ఇక్కడ ఓ బిగ్ ట్విస్ట్ వచ్చి పడింది. గతేడాది ఆర్సీబీ విజయం అనంతరం.. అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత స్టేడియంలో మ్యాచ్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎత్తివేసినప్పటికీ తాజాగా ఐపీఎల్ షెడ్యూల్‌లో బీసీసీఐ కీలక నోట్ ఉంచింది. బెంగళూరులో మ్యాచ్‌లు జరగడం అనేది పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం నియమించిన ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చే క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. “బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి. ఈ కమిటీ మార్చి 13, 2026న ఎం. చిన్నస్వామి స్టేడియంలో సమావేశం, తనిఖీని నిర్వహిస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి స్టేడియం సంసిద్ధతను అంచనా వేయడానికి మ్యాచ్-డే ఏర్పాట్ల పూర్తి స్థాయి మాక్ ప్రదర్శన నిర్వహింస్తారు.” అని బీసీసీఐ నోట్‌లో ప్రకటించింది. ఇక ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచ్‌లను రెండు వేర్వేరు నగరాల్లో ఆడనుంది. బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం)లో 5 హోమ్ మ్యాచ్‌లు, రాయ్‌పూర్ (షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం)లో 2 హోమ్ మ్యాచ్‌లు ఆడనుంది.
READ MORE: AP Gram Panchayats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!