కరోనా ఎంట్రీతో అన్ని దేశాలు ఆంక్షల బాట పట్టాయి.. ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి ఎవరైనా వచ్చారంటే.. అనుమానంగా చూడాల్సిన పరిస్థితి.. అయితే, క్రమంగా ఆ పరిస్థితి పోయినా.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంట్రీతో మరోసారి చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి.. అయితే, ఈ సమయంలో విదేశీ ప్రయాణికులకు హాంగ్ కాంగ్ శుభవార్త చెప్పింది.. హాంగ్ కాంగ్‌కు వచ్చే ప్రయాణికులు ఇకపై 21 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.. Read […]
కరోనా మళ్లీ పంజా విసరడంతో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపట్టాయి.. కానీ, కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను అనుగుణంగా మళ్లీ ఆంక్షలను సడలిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా వైరస్ కేసుల కారణంగా మూసివేసిన తమిళనాడులోని స్కూళ్లు, కాలేజీలు ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి తెరుచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఇక అంతేకాదు.. ఇప్పటికే అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ.. రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.. అలాగే, ఈ ఆదివారం (జనవరి 30) […]
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కడప ఎయిర్‌పోర్టు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంటనే వెనక్కు […]
డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ ఫోకస్ పెట్టారు తెలంగాణ పోలీసులు.. ఇవాళ డ్రగ్స్ పై డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి జంట నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలు హాజరయ్యారు.. డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు డీజీపీ.. ఇక, సీఎంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో హై లెవల్ […]
ఒమిక్రాన్ ఎంట్రీతో మరోసారి కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది.. థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపడుతున్నాయి.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ అమలు చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు.. మరికొన్ని చోట్ల 50 శాతం ఆక్యూపెన్సీతో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నారు.. ఇది, పెద్ద సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే పలు సినిమాలు వాయిదా బాట పట్టాయి.. సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా […]
పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే కొనసాగుతూ వచ్చాయి.. సీఎంగా ఉన్న ఓ సీనియర్ నేత పార్టీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు.. ఇక, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. సీఎం ఓవైపు, పీసీసీ చీఫ్ మరోవైపు.. తమకు తోచినట్టు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ […]
మరోసారి కోవిడ్ ఆంక్షలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖలు రాసింది.. ఫిబ్రవరి 28వ తేదీ వరకు కరోనా మార్గదర్శకాలను పొడిగించినట్టు పేర్కొంది.. ఇదే సమయంలో.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన తగు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది కేంద్రం.. కేసులు తగ్గుముఖం పట్టాయనే ఉద్దేశంతో.. రక్షణ చర్యలను విస్మరించవద్దని పేర్కొంది.. కాగా, కరోనా థర్డ్ వేవ్ పంజా కొనసాగుతూనే ఉంది.. పెద్ద సంఖ్యలో […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులున్నాయి.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే కాదు.. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం.. కాంగ్రెస్‌ను వీడారు.. ఇక, కాంగ్రెస్ పార్టీతో తన సంబంధాలు ముగిశాయని ప్రకటించారు.. అయితే, ఏ పార్టీలో చేరే విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.. ప్రస్తుతం తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. […]