సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై సెటైర్లు వేశారు మంత్రి కొడాలి నాని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన.. సీపీఐ నారాయణ ఓ వింత జంతువు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తానో జాతీయ నాయకుడట.. రెండు ఎంపీ సీట్లు ఉన్న సీపీఐ జాతీయ పార్టీ అయితే.. మాకు 28 మంది ఎంపీలు ఉన్నారన్నారు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో వైఎస్ జగన్ కుటుంబం […]
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)ను ఇవాళ ప్రారంభించారు.. ముదిగొండ మండలం యడవల్లిలో యాత్ర ప్రారంభమైంది.. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఖమ్మం జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభించిన యడవెల్లి జన ఉప్పెనగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర […]
భీమ్లా నాయక్ సినిమాను సీఎం వైఎస్ జగన్ తొక్కేశారు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడినాయన.. జగన్మోహన్ రెడ్డి శత్రువులు, మిత్రుల గురించి ఆలోచించరు.. ప్రజల గురించే ఆలోచిస్తారని తెలిపారు.. సినిమా పరిశ్రమలో సమస్యలకు చంద్రబాబే కారణం అని ఆరోపించిన ఆయన.. కోర్టుకు వెళ్లి అడ్డగోలుగా ఆదేశాలు తెచ్చుకుని ప్రజలను దోచుకున్నా చంద్రబాబు.. గుడ్డివాడుగా వ్యవహరించాడని మండిపడ్డారు. ఇక, భీమ్లా నాయక్‌ను జగన్ తొక్కేశారు అనే […]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నెంబర్ వన్‌గా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోందన్నారు.. భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీకత్తు కింద పెట్టి రుణాలు తీసుకుని రావాలని చూడ్డం శోచనీయమన్న ఆమె.. వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ను ఆధారంగా చేసుకుని అప్పులకు వెళ్తున్నారని విమర్శించారు.. ఉన్న ఆస్తులను అమ్ముకోవడం చూస్తే రాష్ట్రం అధోగతి పాలైపోతోందని అర్ధం […]
కరోనా వల్ల పల్స్ పోలియో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని.. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి రావడంతో మళ్లీ పోలియో చుక్కలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. వచ్చే మూడు రోజులు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 20 వేల సెంటర్లలో పోలియో కార్యక్రమం చేపట్టామని.. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేయాలని సూచించారు.. ఈ సారి 28 లక్షల మంది […]
ఒమిక్రాన్ ఎంట్రీతో ప్రారంభమైన కరోనా థర్డ్‌వేవ్ విజృంభణ తగ్గుముఖం పట్టింది.. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.. తాజాగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,273 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరో 243 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. Read Also: Ukraine Russia War: రష్యాకు బిగ్ షాక్.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం..! ఇక, […]
ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోన్న రష్యాకు పెద్ద షాక్ తగిలింది.. ఇప్పటికే రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన యూరోపియన్ యూనియన్.. కీలకమైన స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించింది. రష్యా ఆర్థిక వ్యవస్థను గట్టి దెబ్బకొట్టేందుకు ఆఖరి అస్త్రంగా స్విఫ్ట్‌ను ప్రయోగించింది. ఇక, రష్యాను స్విఫ్ట్‌నుంచి తొలగించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తంచేశారు. ఇది తమ దేశ చరిత్రలో కొత్త అధ్యాయమన్నారు జెలెన్స్కీ తాము ఈయూలో భాగం అవుతామని ప్రకటించారు. అయితే, స్విప్ట్ నుంచి రష్యాను తొలగించడం ద్వారా ఆర్థిక […]
ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసం కొనసాగుతోంది. యుద్ధం నాల్గో రోజుకు చేరుకోగా..మూడోరోజు ప్రధాన నగరాలే టార్గెట్‌గా రష్యా సైన్యం… మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. సిటీల్లోకి ట్యాంకులు చొచ్చుకెళ్తున్నాయి. ముఖ్యంగా జనావాసాలపైనా బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ఉన్నది కొద్ది పాటి సైన్యం. రష్యాకున్నంత ఆయుధ సంపత్తి లేదు. అయినా ఉక్రెయిన్ సైనికులు వెన్నుచూపడం లేదు. ప్రపంచంలోనే ఓ అమేయశక్తి నేరుగా దాడి చేస్తున్నా.. మాతృభూమిని రక్షణలో ప్రాణాలర్పిస్తున్నారు. మా ప్రాణమున్నంతవరకూ మా మాతృభూమిని ఆక్రమించలేరంటూ… పోరాట […]
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. సామాన్యుడి జీవితం మరింత భారంగా మారనుంది. వంట నూనె, బంగారంతో పాటు చాలా వస్తువుల రేట్లు భారీగా పెరగనున్నాయి.. మన దేశానికి వస్తున్న సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతుల్లో దాదాపు 90 శాతం వరకు రష్యా, ఉక్రెయిన్ల నుంచే దిగుమతి అవుతుంది. దేశంలో ఎక్కువ మంది వాడే వంట నూనెల్లో మొదటి స్థానం పామాయిల్ ఉంటే, రెండో స్థానం సన్ ఫ్లవర్ ఆయిల్ దే. […]
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. యుద్ధం ప్రారంభమైన రోజునే దీని ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు రష్యా వార్… జఠిలసమస్యగా మారింది. రష్యా-ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై పడింది. దీంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ.20, డీజిల్ రూ.15లను ఒక్కసారిగా పెంచేశాయి. […]