కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు… రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది.. కానీ, అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం.. రాహుల్ గాంధీ మీటింగ్‌కి అనుమతించాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను ఆదేశించింది.
Read Also: YS Viveka murder case: బెయిల్ పిటిషన్.. శుక్రవారానికి వాయిదా
కాగా, ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ.. దీనిపై విచారణ చేపట్టింది జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్.. అయితే, రాహుల్ గాంధీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే వస్తున్నాడని హైకోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది.. గతంలో వివిధ పార్టీలు చాలా మీటింగ్స్ నిర్వహించారని, ఇప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో తెలపాలని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.. సింగిల్ బెంచ్ ఆదేశాలతో మళ్లీ దరఖాస్తు చేసుకున్న అనుమతి నిరాకరించారని కోర్టుకు తెలిపారు.. ఇరువాదనలు విన్న హైకోర్టు.. రాహుల్ ఓయూ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. రాహుల్ గాంధీ మీటింగ్‌కి అనుమతించాలని ఓయూ వీసీని ఆదేశించింది.. విద్యార్థులతో ముఖుముఖికి అనుమతించిన హైకోర్టు.. 150 మందితో మాత్రమే అనుమతించాలని వీసీకి ఆదేశాలు జారీ చేసింది.