భారత దేశ రైతాంగానికి శుభవార్త.. ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. భారత్‌లోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.., అండమాన్‌ను తాకాయి నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరించినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది ఐఎండీ.
Read Also: Bandi Sanjay: నాగరాజు కుటుంబానికి పరామర్శ.. హత్య వెనుక పెద్ద కుట్ర..!
ఇక, నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి.. అండమాన్ నికోబర్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలోభారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.. మరోవైపు.. రానున్న 24 గంటల్లో తమిళనాడు, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.. రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది ఐఎండీ.