వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినట్టు వెల్లడించారు మంత్రి హరీష్‌రావు.. మెదక్ లోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రజకుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 33 జిల్లాల్లో రెండేసి కోట్లతో మోడ్రన్ దోబీ ఘాట్ లు నిర్మిస్తామని తెలిపారు. వృత్తి పైనా ఆధారపడ్డ రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని గుర్తుచేసిన ఆయన.. 80 శాతం సబ్సిడీతో రజకులకు సబ్సిడీ లోన్లు […]
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్… అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసి… విజయం సాధించారు. ఇప్పటికే ఆయన ఆజంగఢ్ లోక్‌సభ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అఖిలేష్ యాదవ్… ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అఖిలేష్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత ఆజం ఖాన్ కూడా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాంపూర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న […]
గుజరాత్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. తాము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. కాంగ్రెస్ ను ఏం చేస్తారనేది జీ23 నేతలే చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు క్వార్టర్ పొడిగించాలని ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వెళ్లాయన్నారు. దీనిక వెనక మతలబు ఏంటని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినా… బీజేపీ తమకు శతృవునేనన్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లలో […]
ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ త్వరలోనే ప్రమాణం చేయనున్నారు. హోలీ పండగకు ముందే ఆయన ప్రమాణం చేస్తారని బీజేపీ వర్గాలంటున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ టెన్యూర్ మే 14 వరకు ఉంది. దీంతో ఆయన ప్రమాణం లేట్ కావొచ్చని భావించారు. అయితే ఈ నెల 14 లేదా 15 తేదీల్లో ప్రమాణ కార్యక్రమం ఉండొచ్చని బీజేపీ వర్గాలు హింట్ ఇచ్చాయి. 2017లో మార్చి 19న ప్రమాణం చేశారు యోగి. ఈ రాత్రికి లేదంటే రేపు ఢిల్లీ వెళ్లనున్నారు […]
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓ వైపు ఉక్రెయిన్ చర్చలకు ప్రతిపాదనలు పంపుతున్నా.. రష్యా మాత్రం దాడులు చేస్తూనే ఉంది.. ఇక, రష్యాతో నాటో ప్రత్యక్ష పోరుకు దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. ఆ పరిణామాలను నివారించేందుకే ఉక్రెయిన్ విషయంలో రష్యాతో అమెరికా నేరుగా పోరాటం చేయట్లేదని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా రసాయన ఆయుధాలు వినియోగిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. […]
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో వందల మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా. యుద్ధం మొదలై రెండు వారాలు దాటిపోయింది. ఉక్రెయిన్ లో అపార ప్రాణ, అస్తి నష్టం జరుగుతోంది. ఇళ్లు, అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్ ఇలా మౌలిక వసతులన్ని దెబ్బతిన్నాయి. సిటీలన్నీ శిథిలాలతో నిండిపోయాయి. నివాస ప్రాంతాల్లోనూ రష్యా సైన్యం దాడులు చేస్తుండటంతో ప్రాన నష్టం భారీగానే జరుగుతోంది. చనిపోయిన సాధారణ పౌరుల సంఖ్య వెయ్యి దాటిందని అంచనా […]
సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే చర్చ సాగుతోంది.. సీఎం జగన్ ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీడీపీ నేతలు అంటున్నారు.. ఇక, ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్ని పార్టీలు చెబుతున్నమాట.. ఇక, రాష్ట్రంలో రాబోయేది జనసేన ప్రభుత్వమే అంటున్నారు.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన […]
కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఓటములు తప్పడంలేదు.. ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని ఖంగుతినిపించాయి.. ఐదుకు ఐదు రాష్ట్రాల్లోనూ ఘోర పరాభవం ఎదురైంది.. మరోవైపు జీ23 నేతల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజీనామా చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామాలు […]
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభాక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు.. అక్రమంగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై ఆదివారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరుతూ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు.. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న […]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది… ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శలు ఓ రేంజ్లో జరుగుతున్నాయి… తాజాగా, ఆ విషయంపై స్పందించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయి (వైఎస్ వివేకానందరెడ్డి)ని ఎవరు చంపారో క్లారిటీ వచ్చిందన్నారు.. సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి ప్రథమ ముద్దాయిగా.. జగన్ కూడా అందులో భాగస్వామిగా తేలిందని వ్యాఖ్యానించిన ఆయన.. వైఎస్ వివేకా […]