సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం కొత్త మలుపు తీసుకోవడం.. నోటీసులు, కిడ్నాప్‌లు.. ఇలా రకరకాల కథనాలు నడుస్తున్నాయి.. ఇద్దరిపై ఎస్‌ఆర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదు కావడం.. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం చర్చగా మారింది.. అయితే.. ఈ వ్యవహారంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఆమె సోదరుడు తారక్..కరాటే కల్యాణి నిన్న గుడికి వెళ్తున్నా అని చెప్పి వెళ్లి ఇప్పటి వరకు ఇంటికి రాలేదన్న ఆయన.. మా అక్క కిడ్నాప్ కాలేదన్నారు.. మా అక్క ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేయలేదు.. ఇప్పటి వరకు పిల్లల్ని ఎవర్ని దత్తతకు కూడా తీసుకోలేదన్నారు తారక్.
Read Also: Congress Party: ఏపీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్‌రెడ్డి?
అయితే, కొంత మంది నిరుపేదల పిల్లలను, వారి కుటుంబాన్ని మా అక్కే చూసుకుంటున్నారని తెలిపారు తారక్.. ఇక, మాకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదన్న ఆయన.. కల్యాణికి గతంలో ఓ ఆధ్యాత్మిక సంస్థతో విభేదాలు వచ్చాయి.. వాళ్లలో కలిసి యూట్యూబర్ చేతులు కలిపారని ఆరోపించారు. మా అక్కపై చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే వారి సంగతి చూస్తానని హెచ్చరించారు. ఒకట్రెండు రోజుల్లో కల్యాణి అధికారుల ముందుకు వచ్చి ఆ చిన్నారులను ఎందుకు తెచ్చుకున్నారో సమాధానం ఇస్తారని తెలిపారు కరాటే కల్యాణి సోదరుడు తారక్.
మరోవైపు.. ఈ వ్యవహారంపై హైదరాబాద్ కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మొదటి నోటీసుకు కరాటే కల్యాణి స్పందించలేదు.. వారం గడువు ఇచ్చి మళ్లీ నోటీసులు ఇస్తాం, ఖచ్చితంగా స్పందించాల్సిందే అన్నారు. దత్తత ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు, దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని.. మాకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు వచ్చింది.. ఒకరిని…తీసుకున్నారా..? ఇద్దరినీ దత్తత తీసుకున్నారా? అనేది తెలియదు.. కానీ, విచారణ జరుగుతోందని తెలిపారు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్.