ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో జరిగిన వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక అంశాలను వెల్లడించారు పోలీసులు.. రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో భాగంగా వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. బజరయ్య సహకారంతో సురేశ్, హేమంత్, మోహన్‌లు కలిసి గంజి ప్రసాద్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసు విచారణలో తేలింది. Read Also: RBI: వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..! రెడ్డి […]
వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆర్బీఐ నిర్ణయం ఎఫెక్ట్ స్టాక్ మారెట్లపై పడింది.. సెన్సెక్స్ భారీగా కుప్పకూలింది. నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది. ఇక, భారత స్టాక్ మార్కెట్లపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా పడింది.. దీంతో, ద్రవ్యోల్బణం 17 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఇక, రెపో రేటు […]
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. మరోసారి హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనకు వర్సిటీ వీసీ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే కాగా.. రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఎన్ఎస్యూఐ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్ల దరఖాస్తుపై నిర్ణయాన్ని ఓయూ వీసీకే వదిలేయడం జరిగిపోయాయి.. ఇదే సమయంలో ఈ నెల 5వ తేదీలోగా […]
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ… నేపాల్‌లో వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజధాని ఖాట్మండులో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. మయన్మార్ నేపాల్ దౌత్యవేత్తగా పనిచేసిన భీమ్ ఉదాస్.. తన కుమార్తె మ్యారేజ్‌కు రాహుల్‌ను ఆహ్వానించగా.. ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఖాట్మాండులోని నైట్‌క్లబ్‌లో రాహుల్ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నిజానికి ఈ వీడియోను వైరల్‌గా మార్చింది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూరప్ పర్యటనపై రాహుల్‌గాంధీ విమర్శలు […]
తెలంగాణలో బీజేపీ కేంద్ర పార్టీ చాప కింద నీరులా తమ యాక్టివిటీ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే సెంట్రల్ టీంలు తెలంగాణలో మకాం వేసాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.. ఇక, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఉమ్మడి జిల్లాకో ఇంచార్జ్ ని కేంద్ర పార్టీ నియమించబోతుంది అని తెలుస్తుంది… ఈ ఇంచార్జ్ లు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఉంటారని సమాచారం. ఇప్పటికే కేంద్రంలోని పార్టీ.. కొన్ని టీమ్‌లను తెలంగాణ పంపిందని టాక్. ఆ టీమ్‌లు […]
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. పది గంటల కల్లా మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. తెలంగాణలో ఒక్కరోజు వ్యవధిలోనే వడదెబ్బకు గురై నలుగురు మృతిచెందారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ […]
యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ డెన్మార్క్ వెళ్లారు. తొలిరోజు జర్మనీలో పర్యటించిన ఆయన.. రెండో రోజున అక్కడి నుంచి కోపెన్హాగన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడ మోడీకి డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫ్రెడరిక్సన్ స్వాగతం పలికారు. తర్వాత ఇద్దరూ కలిసి డెన్మార్క్ ప్రధాని అధికారిక నివాసం మానియన్ బోర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ఫ్రెడరిక్సన్.. తన నివాసం మొత్తాన్ని మోడీకి చూపించారు. భారత పర్యటనకు వచ్చినప్పుడు.. తనకు మోడీ గిఫ్ట్‌గా ఇచ్చిన పెయింటింగ్‌ను కూడా […]
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఉక్రెయిన్ ఆక్రమణను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్‌పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ చర్యలో భాగంగా రష్యా తన పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. మే 9వ తేదీన విక్టరీ డేను రష్యా జరుపుకుంటోంది. 1945లో ఆ రోజున నాజీలను రష్యా ఓడించింది. ఆ రోజున ఉక్రెయిన్‌లో సాధించిన సైనిక […]
జోధ్‌పూర్ ఘర్షణల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే… పెద్దఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్. కావాలనే కొంతమంది అల్లర్లు సృష్టించారని ఆయన ఆరోపించారు. కార్లను ధ్వంసం చేయడం, ఇళ్లపై రాళ్లతో దాడి చేయడం, మహిళలను అవమానించడం వంటివి జరిగాయన్నారు. అల్లర్లకు అరికట్టడంలో… రాజస్థాన్ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యాయన్నారు. రాత్రి అల్లర్లు జరిగినా… ఉదయానికి కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు. కాగా, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య సోమవారం […]
ఔరంగాబాద్ ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాలీ నిర్వాహకులైన మరో ముగ్గురు పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు ఔరంగాబాద్ పోలీసులు. ఘర్షణలకు దారితీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రాజ్‌ఠాక్రేపై అభియోగాలు నమోదు చేశారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లను తొలగించాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కార్‌కు రాజ్‌ఠాక్రే అల్టిమేటం ఇచ్చారు. మే 3లోగా మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని ముంబై ర్యాలీలో ఆయన మహారాష్ట్ర సర్కార్‌కు డెడ్‌లైన్ విధించారు. ఆ గడువు […]