* కామన్వెల్త్ గేమ్స్‌లో దూసుకెళ్తోన్న భారత్… ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 20 పతకాలు.. అందులో 6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్య పతకాలు
* నేడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించనున్న కాంగ్రెస్
* ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 10 రోజుల పాటు.. తెలంగాణలోని గోల్కొండ, చార్మినార్, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, పిల్లల మర్రి, రామప్ప టెంపుల్ లోకి ఉచితంగా అనుమతి.
* విజయవాడ: నేడు వరలక్ష్మిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ
* తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోల పాటు భారీ వర్షాలు, ఏపీలో 8 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, తెలంగాణలో 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.
* అమరావతి: ఇవాళ వ్యవసాయ శాఖ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమావేశం
* నెల్లూరు జిల్లా: వెంకటాచలం మండలం అనికేపల్లి.లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
* నెల్లూరు: మర్రిపాడు మండలం డి.సి.పల్లి.లో నేటి నుంచి గంగమ్మ తల్లి ఉత్సవాలు
* నేడు విశాఖకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, వంశధార ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళనున్న మంత్రి అంబటి