Social Boycott: ఊరి నుంచి బహిష్కరణ.. ట్రాక్టర్ నడపడమే ఆమె చేసిన తప్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలలు ప్రపంచంతో పోటీపడుతున్నారు.. వంట గదికే మేం పరిమితం కాదు.. మాకు సరిహద్దులు లేవంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. విద్యలోనూ కాదు.. ఉద్యోగాల్లోనూ మాకు తిరుగులేదని సత్తా చాటుతున్నారు.. అయినా, వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది… అయితే, తమ కుటుంబ బారాన్ని భుజానికి ఎత్తుకున్న ఓ యువతి.. తమకు ఉన్న పొలంలో వ్యవసాయ పనులు మొదలు పెట్టింది.. అంతే కాదు.. పొరుగునే మరికొంత భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది.. వ్యవసాయ పనుల కోసం ఆమె ట్రాక్టర్ వినియోగిస్తోంది.. అక్కడే అసలు చిక్కు వచ్చింది.. ట్రాక్టర్ దున్ని వ్యవసాయం చేస్తే గ్రామానికి చెడు జరుగుతుందని వాదిస్తోన్న గ్రామస్తులు.. ఆ యువతని గ్రామం నుంచి బహిష్కరించారు.. ఓవైపు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయ్యిందంటూ.. సంబరాలు చేసుకుంటుంటే.. మనం ఇంకా ఎక్కడ ఉన్నామని ఇలాంటి కొన్ని ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి..
Read Also: Common Wealth Games 2022: కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ షెడ్యూల్ నేడు
Also Read
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
ఇక, 22 ఏళ్ల యువతిని గ్రామ బహిష్కరణ చేసిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ గుమ్లా జిల్లా బిషున్‌పూర్ బ్లాక్‌లోని శివనాథ్‌పూర్ పంచాయతీ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది.. అక్కడ మంజు ఒరాన్ అనే యువతి తన తల్లిదండ్రులు మరియు సోదరుడితో కలిసి జీవిస్తోంది.. గుమ్లాలోని కార్తీక్ ఓరాన్ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న మంజుకు ఆరు ఎకరాల సాగు భూమి ఉంది… ఆ భూమిని సాగుచేస్తూ ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది.. ఆ కుటుంబం పదెకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం దైనిక్ భాస్కర్ అనే వ్యక్తితో మాట్లాడిన మంజు.. గత నెలలో పాత ట్రాక్టర్ కొనుగోలు చేశారు.. ఆ ట్రాక్టర్‌తో తన పొలాల్లో పనులు చేస్తోంది.. స్వయంగా పొలాన్ని దున్నుతోంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది.. దీనిని గమనించిన గ్రామస్థులు.. మహిళలు ట్రాక్టర్ నడపితే చెడు జరుగుతోందని.. దీని వల్ల గ్రామంలో కరవు వస్తుందన్న నమ్మకంతో.. మంజు ట్రాక్టర్ తో దున్నడం వల్ల గ్రామానికి చెడు జరుగుతుందని.. వెంటనే నిలిపివేయాలని వారించారు.
అంతేకాదు.. ఆ గ్రామ కట్టుబాట్లను దాటి ట్రాక్టర్ నడిపిందంటూ.. జరిమానా విధించారు… అయితే, ఆ యువతి మాత్రం వెనక్కి తగ్గలేదు.. తన తాను చేసుకుంటూ పోయింది.. దీంతో, వ్యవహారం అక్కడితో ఆగలేదు.. పంచాయతీ నిబంధనలను అతిక్రమించినందుకు మంజును గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. కానీ, గ్రామస్థులు చేసిన తీర్మానాన్ని తిరస్కరించిన ఓ యువతి.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. అంతరిక్షంలో సైతం అడుగుపెట్టారు.. కానీ, తాను వ్యవసాయం ఎందుకు చేయొద్దంటూ ప్రశ్నించింది. తనకు వ్యవసాయం అంటే ఇష్టం.. పంచాయతీ విధించిన షరతులను అంగీకరించేది లేదు.. ట్రాక్టర్‌తో వ్యవసాయం కొనసాగిస్తానని స్పష్టం చేసింది మంజు. ఇక, తన పొలాల్లో ట్రాక్టర్ నడపడం ఇదే మొదటిసారి కాదని.. ఇంతకు ముందు కూడా పొలాల్లో ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేశా.. ఈసారి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో అర్థం కావడం లేదని ఆ యువతి మండిపడుతోంది..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
-
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!