భారత్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,893 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఇదే సమయంలో మరో 53 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 20,419 మంది కోలుకున్నట్టు.. పాజిటివిటీ రేటు 4.94శాతంగా ఉందని.. రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగిందని.. యాక్టివ్ కేసుల సంఖ్య 0.31శాతంగా ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,19,811గా చేరుకోగా.. మరణాలు సంఖ్య 5,26,530కి పెరిగింది.. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,36,478 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. కోలుకున్నవారి సంఖ్య 4,34,24,029కి పెరిగింది.. మరోవైపు.. కరోనా కట్టడి చర్యల కోసం ఉద్దేశించి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. బుధవారం 38,20,676 మందికి టీకాలు పంపిణీ చేయడంతో.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205.22 కోట్లు దాటింది.. ప్రస్తుతం, ఫస్ట్, సెకండ్ డోస్‌లతో పాటు.. బూస్టర్ డోస్ కూడా పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే.
Read Also: IndiGo Revenue Soars. But: ఇండిగో ఆదాయానికి రెక్కలు. అయినా చుక్కలే..