భారత్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అయితే, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉగ్రవాదుల నుంచి ఉప్పు ఉందని ఇంటెలీజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది… ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) తదితర తీవ్రవాద గ్రూపులు ఉగ్రదాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరిక జారీ చేసింది. దీనిపై ఐబీ 10 పేజీల నివేదిక సమర్పించింది.. ఆ నివేదికలో.. ఎర్రకోటలో ప్రవేశ నిబంధనలను కఠినతరం చేయాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది ఐబీ..
స్వాతంత్ర్య దినోతవ్స వేడుకలతో పాటు.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దాడి, ఉదయపూర్, అమరావతిలో జరిగిన ఘటనలను నివేదికలో ప్రస్తావించింది ఐబీ.. అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.. రాడికల్ గ్రూపులపై ,రద్దీ ప్రదేశాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని పేర్కొంది.. జైషే, లష్కరే ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ మద్దతు ఇస్తూ పాక్ ఐఎస్ఐ ఉగ్రదాడులకు రెచ్చగొడుతోందని నివేదిక పేర్కొంది. పెద్ద నాయకులు, ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరించింది. ఢిల్లీలోని రోహింగ్యాలు, ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ సూడాన్ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలపై కఠినమైన పర్యవేక్షణ ఉంచాలని నివేదికలో పేర్కొంది ఐబీ.. టిఫిన్ బాంబు, స్టిక్కీ బాంబు, వీవీఐడీలు పెట్టే అవకాశం ఉందని హెచ్చరించింది.. దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు.. అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించింది ఐబీ.
ఐబీ తన నివేదికలో, స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రాడికల్ గ్రూపులను పర్యవేక్షించాలని ఢిల్లీ పోలీసులు మరియు ఇతర రాష్ట్రాలను ఆదేశించింది. ఐఎస్ఐ రూపొందించిన లష్కరే ఖల్సాలో ఆఫ్ఘన్ ఫైటర్‌ను చేర్చారు. ఈ ఉగ్రవాద సంస్థ జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఉగ్రవాద దాడిని చేయగలదు. ఇక, ఉగ్రవాద సంస్థలు అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, మరియు పారాగ్లైడర్‌లను ఉపయోగించవచ్చని నివేదిక పేర్కొంది. అందువల్ల బీఎస్ఎఫ్ అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఢిల్లీలోని రోహింగ్యాలు, ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ సూడాన్ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలపై కఠినమైన పర్యవేక్షణ కోసం కూడా సూచనలు ఇవ్వబడ్డాయి. దీంతో పాటు టిఫిన్ బాంబు, స్టిక్కీ బాంబు, వీవీఐడీల బెదిరింపులను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ఐబీ పోలీసులను ఆదేశించింది.